NTV Telugu Site icon

Bathing: భర్త “స్నానం” చేయడం లేదని విడాకులు కోరిన మహిళ..

Divorce

Divorce

Bathing: ఉత్తర ప్రదేశ్‌ ఆగ్రాలో విచిత్రమై సంఘటన జరిగింది. భర్త స్నానం చేయడం లేదని చెబుతూ ఓ మహిళ విడాకులు కోరింది. పెళ్లయిన 40 రోజులకే భర్త నుంచి విడాకుల కోసం అఫ్లై చేసుకుంది. భర్త వ్యక్తిగత పరిశుభ్రత లోపాన్ని చూపుతూ తనుకు విడాకులు కావాలని దరఖాస్తు చేసింది. భర్త నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే స్నానం చేసేవాడని ఆమె ఆరోపించింది. దీంతో ఆ దాంపత్యం కొన్ని రోజుల్లోనే విడాకుల వరకు వచ్చింది.

Read Also: Mini-Moon: చంద్రుడికి మినీ-చంద్రుడు తోడు..‘‘మహాభారతం’’తో సంబంధం.. 2 నెలలు భూమి చుట్టూ భ్రమణం..

బాధిత మహిళ ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ని ఆశ్రయించింది. 40 రోజుల్లో తన భర్త ఆరుసార్లు మాత్రమే స్నానం చేశాడని ఆమె పేర్కొంది. అది కూడా తాను పట్టుబట్టడంతోనే స్నానం చేశాడని చెప్పింది. అతడి శరీరం నుంచి తట్టుకోలేని దుర్వాసన వస్తుందని వెల్లడించింది. మహిళ భర్త రాజేష్ వారికి ఒకసారి పవిత్రంగా భావించే గంగా జలాన్ని మాత్రమే చల్లుకుంటాడని తెలిసింది.

ఇలాంటి అపరిశుభ్రత కలిగిన వ్యక్తితో కలిసి ఉండలేనని మహిళ విడాకులకు అఫ్లై చేసింది. తన భర్త రోజూ స్నానం చేయడానికి నిరాకరించడంతో తమ మధ్య గొడవులు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని సదరు వ్యక్తి కూడా అంగీకరించాడు. తాను సాధారణంగా నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తానని చెప్పాడు. పెళ్లయిన కొన్ని వారాలకే తరుచూ గొడవలు జరగడంతో మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. పోలీసులతో చర్చించిన తర్వాత భర్త రాజేష్ తన పరిశుభ్రతను మెరుగుపరుచుకోవడానికి అంగీకరించాడు, రోజూ స్నానం చేస్తానని హామీ ఇచ్చాడు. అయినప్పటికీ సదరు మహిళ అతడితో కలిసి ఉండేందుకు ఇష్టపడలేదు. తదుపరి చర్చల కోసం సెప్టెంబరు 22న ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కి తిరిగి రావాలని దంపతులకు సూచించబడింది.

Show comments