Man Transformed Barren Land Into Forest: పర్యావరణ సమతౌల్యానికి పచ్చదనమే శ్రీరామ రక్ష. ఆధునిక యుగంలో మాత్రం ప్రజలు అసలు ప్రకృతి క్షేమమే పట్టించుకోవడం లేదు. కొంత మంది మాత్రం ప్రకృతే ప్రాణంగా బతుకుతున్నారు. ఇటాంటి వారిలో ఖచ్చితంగా ఉంటారు మణిపూర్ కు చెందిన మొయిరంగ్థేం లోయా. 20 ఏళ్లలో ఓ అటవీనే పెంచారు. 300 ఎకరాల బంజరు భూమిని పచ్చని అడవితో నింపేశాడు. ప్రకృతి ప్రేమికుడు అయిన మొయిరంగ్థెం లోయా తన 20 ఏళ్లలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ జిల్లా ఉరిపోక్ ఖైడెం లైకై ప్రాంతానికి చెందిన మొయిరంగ్థెం లోయా ఇంఫాల్ శివార్లలోని లాంగోల్ హిల్ శ్రేణిలోని 20 ఏళ్ల క్రితం చెట్లను నాటడం ప్రారంభించాడు. ఒకప్పుడు బీడు భూమిగా ఉన్న ఆ ప్రాంతం నేడు పచ్చని చెట్లతో నిండిపోయింది.
Read Also: AAP Leader Climbs Tower: టికెట్ ఇవ్వలేదని టవర్ ఎక్కిన ఆప్ నేత
2000 సంవత్సరం ప్రారంభంలో చెన్నైలోని ఓ కాలేజీలో విద్య ముగించుకుని సొంత రాష్ట్రం మణిపూర్ కు చేరుకున్నాడు. అయితే కౌబ్రూ పర్వతానికి వెళ్లిన సమయంలో మొయిరంగ్థెం లోయా అక్కడ ఉంటే చెట్లు చాలా వరకు తొలగించబడ్డాయి. విస్తృతంగా సాగుతున్న అటవీ నిర్మూలన చూసిన తర్వాత ఆ విషయం నన్ను భయపెట్టిందన్నారు లోయా. ఆ క్షణమే మళ్లీ చెట్లను పెంచాలని బలంగా కోరుకున్నారు. ఇలా అనుకుంటున్న సమయంలో ఇంఫాల్ శివార్లలోని బంజరుగా ఉన్న ప్రాంతాన్ని అడవిగా మార్చవచ్చని భావించా అని 47 ఏళ్ల మొయిరంగ్థెం లోయా చెప్పారు.
వెదురు, ఓక్, జాక్ ఫ్రూట్ చెట్లతో పాటు టేకు చెట్లను నాటాడు. సాధారణంగా నేను మొక్కలు కొనుగోలు చేసి వాటిని తీరిక సమయాల్లో నాటుతుంటా అని మొయిరంగ్థెం లోయా వెల్లడించారు. వానాకాలం కన్నా ముందే చెట్ల పెంపకం ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. లోయా ప్రయత్నానికి రాష్ట్ర అటవీ శాఖ కూడా మద్దతు తెలిపింది. 300 ఎకరాల్లో 100కు పైగా మొక్కలు, 25 రకాల వెదురు జాతులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతం జింకలు, పాములకు నిలయంగా ఉందని అటవీ అధికారులు వెల్లడించారు. లోయా జీవనోపాధి కోసం ఫార్మసీని నడుపుతున్నారు.
