Site icon NTV Telugu

Toilet seat explode: టాయ్‌లెట్ సీట్ పేలి వ్యక్తికి తీవ్రగాయాలు.. అసలు ఎందుకు ఇలా జరిగింది..?

Toilrt Seet

Toilrt Seet

Toilet seat explode: అసాధారణమైన ఘటన, ఇలాంటి ఘటన జరుగుతుందని కూడా కలలో ఊహించము. గ్రేటర్ నోయిడాలో ఒక వ్యక్తి ఇంట్లోని వెస్ట్రన్ టాయిలెట్ సీట్ పేలిపోయింది. ఈ ఘటనతో సదరవు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 35 శాతం కాలిగి గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం సెక్టార్ 36లో ఈ పేలుడు సంభవించింది. అషు నగర్ అనే వ్యక్తి టాయ్‌లెట్ ఫ్లష్ బటన్ నొక్కగానే, టాయిలెట్ పెద్ద శబ్ధంతో పెలిపోయి, మంటలు చెలరేగాయి. అయితే, ఆ సమయంలో బాధిత వ్యక్తి మొబైల్ ఫోన్ కానీ, ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించలేదు.

అషు తండ్రి సునీల్ ప్రధాన్ మాట్లాడుతూ.. ఈ పేలుడు కారణంగా అషు ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. ఘటన తర్వాత అతడిని గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)కి తరలించారు, అక్కడ అతనికి 35% కాలిన గాయాలు అయినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు.

Read Also: Rajkumar Mishra: లండన్‌లో మేయర్‌గా ఎన్నికైన భారతీయుడు..

విద్యుత్ లోపాల వల్ల పేలుడు సంభవించినట్లు పలువురు అనుమానిస్తున్నారు. అయితే, ఎయిర్ కండీషనర్‌తో పాటు అన్ని విద్యుత్ పరికరాలు ఆ సమయంలో పనిచేస్తూనే ఉన్నాయి. అయితే, ప్రాథమిక అంచనా ప్రకారం, టాయిలెట్ బౌల్‌లో మీథేన్ గ్యాస్ పేరుకుపోవడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. మురుగు కాలువ మూసుకుపోవడం వల్ల టాయిలెట్ బౌల్ లోపల గ్యాస్ పేరుకుపోయినట్లు కుటుంబం అనుమానిస్తోంది.

నిజానికి, నిప్పు రవ్వ గ్యాస్‌ని మండించి ఉండాలి, అయితే ఈ పేలుడుకు దారి తీసిన నిప్పురవ్వ ఎక్కడి నుంచి వచ్చిందో ప్రస్తుతానికి తెలియదు. స్థానిక నివాసి హరీంద్ర భాటి మాట్లాడుతూ.. ఇక్కడి పైపులు చాలా పురాతనమైనవని, చాలా ఏళ్లుగా శుభ్ర పరచలేదని, పైపుల్లో గ్యాస్ పేరుకుపోయి ఒత్తిడి పెరిగి పేలిపోయేలా చేసిందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. గ్రేటర్ నోయిడా అథారిటీ సీనియర్ మేనేజర్ ఎపి వర్మ మాట్లాడుతూ.. టాయిలెట్ వ్యవస్థ శుభ్రంగా, సాధారనంగా పనిచేస్తోందని, ఇంటిలో అంతర్గత సమస్య వల్ల పేలుడు జరిగి ఉండొచ్చనని అన్నారు.

Exit mobile version