Man Kills Mother, Neighbours After Fight Over “Going Out Naked”: జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. నగ్నంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన కొడుకును వారించింది తల్లి. దీంతో తల్లిని దారుణంగా హత్య చేశాడు కొడుకు. అడ్డుగా వచ్చిన చుట్టుపక్కల వారిపై దాడి చేసి మరో ఇద్దరిని చంపేశాడు. నిందితుడు మానసిక వికలాంగుడిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.
జావిద్ అహ్మద్ రాథర్ అనే వ్యక్తి అనంత్ నాగ్ జిల్లా అష్ముకం గ్రామంలో విధ్వంసానికి దిగాడు. నగ్నంగా బయటకు వెళ్లొద్దన్నందుకు తల్లి హఫీజా బేగంపై కర్రతో దారుణంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడిక్కడే మరణించింది. అతడి దాడి నుంచి కుటుంబాన్ని రక్షించేందుకు వచ్చిన ఇరుగుపొరుగువారిపై కూడా దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో మహ్మాద్ అమీన్ షా, గులాం నబీ ఖాదీమ్ అనే ఇద్దరు వ్యక్తు మరణించగా. ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై కేసుల నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Also: CM KCR : కైకాల విలక్షణ నటుడు.. కొంతకాలం మేము కలసి పని చేశాం
జావిద్ నగ్నంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడని పొరుగు వారు పోలీసులకు వెళ్లడించారు. హఫీజా బేగం అతడిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందని.. దీంతో కోపంతో తల్లిపై దాడి చేశాడని, ఆ తరువాత అడ్డుగా వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. ఇదే విధంగా ఒక రోజు ముందు జావిద్ నగ్నంగా మార్కెట్ లో తిరుగుతుండటం చూసి పహల్గామ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత పోలీసులు అతడిని కుటుంబానికి అప్పగించారు. తాజాగా శుక్రవారం కూడా ఇలాగే చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ హత్యలు చోటు చేసుకున్నాయి.
