Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో విచిత్ర సంఘటన జరిగింది. ఈ నెల 12న పెళ్లికావాల్సిన యువతిని బలవంతంగా కిడ్నాప్ చేశాడు ఓ వ్యక్తి. అంతటితో ఆగకుండా కిడ్నాప్ అయిన యువతిని ఎత్తుకుని ఏడడుగులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి పెళ్లైపోయిందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే జైసల్మీర్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతిని పుష్పేంద్ర సింగ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. తనతో పెళ్లి ఆగిపోయిందనే కోపంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘనట జూన్ 1న జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్ లో చక్కర్లు కొడుతోంది.
ముందుగా పుష్పేంద్రకు ఆ యువతితో పెళ్లి నిశ్చయం అయింది. అయితే ఎందుకో తెలియదు కానీ ఆ పెళ్లి రద్దైంది. జూన్ 12న సదరు యువతికి వేరే యువకుడితో పెళ్లి జరగనుంది. అయితే ఈ విషయం తెలిసిన నిందితుడు పుష్పేంద్ర సింగ్, మరికొంత మంది యువకులు, తన బంధువులతో కలిసి యువతి ఇంటిపై దాడి చేసి, ఆమెను కిడ్నాప్ చేశాడు. ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, గడ్డికి నిప్పు పెట్టి దాని చుట్టూ ఏడడుగులు యువతిని ఎత్తుకుని ప్రదక్షిణలు చేశారు. హిందూ ఆచారం ప్రకారం తమ ఇద్దరికి పెళ్లి జరిగిందని నిందితుడు చెప్పడం వీడియో చూడవచ్చు. ఈ తతంగాన్ని వీడియో తీసి వైరల్ చేశాడు.
Read Also: Ashish Vidyarthi: ఛీఛీ.. ముసలోడు.. రెండో పెళ్లి అంటున్నారు.. చేసుకుంటే తప్పేంటి
ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు మహిళను రక్షించి, పుష్పేంద్రను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కూడా రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి బంధువులు, స్నేహితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబీకులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ సంఘటన “దిగ్భ్రాంతికరమైనది మరియు భయానకంగా ఉంది” అని పేర్కొంటూ, Ms మలివాల్ హిందీలో ట్వీట్ చేశారు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నారు. ఇది చాలా షాకింగ్ గా, భయపెట్టేలా ఉందని సీఎం అశోక్ గెహ్లాట్ దీనిపై విచారణ జరిగి చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో రాజస్థాన్ లో జింగిల్ రాజ్ కొనసాగుతుందని ఈ వీడియో దీనికి నిదర్శనం అని బీజేపీ ఎంపీ కల్నల్ రాజ్యవర్థన్ రాథోడ్ విమర్శించారు.
मीडिया द्वारा ये वीडियो जैसलमेर का बताया जा रहा है। रिपोर्ट्स के अनुसार एक लड़की को सरेआम किडनैप करके एक बंजर वीराने में आग जलाकर उसके साथ ज़बरदस्ती शादी कर ली। ये बेहद चौंकाने वाली और डराने वाली घटना है। @AshokGehlot51 जी मामले की जाँच कर कार्यवाही करें। pic.twitter.com/mZee4oJgSy
— Swati Maliwal (@SwatiJaiHind) June 6, 2023