NTV Telugu Site icon

Google Maps: గూగుల్ తల్లిని నమ్ముకుంటే.. చివరకు కారుని ఎక్కడికి తీసుకెళ్లిందో చూడండి..

Google ,maps

Google ,maps

Google Maps: ఇటీవల కాలంలో గూగూల్ నావిగేషన్ మ్యాప్స్‌ని నమ్ముకుని కొంతమంది ప్రయాణాలను కొనసాగిస్తే ప్రమాదాలు ఎదురయ్యాయి. ఇటీవల కేరళలో గూగుల్ మ్యాప్స్ ద్వారా కారు నడుపుతుంటే, అది కాస్త నదిలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో మరణాలు సంభవించాయి. మరికొన్ని సందర్భాల్లో దగ్గరి మార్గం కోసం నావిగేషన్‌ని నమ్ముకుంటే, తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Read Also: Iran: ఇజ్రాయిల్ “మొసాద్” ఏజెంట్లను ఉరితీసిన ఇరాన్..

తాజాగా ఇలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. వీకెంట్ ట్రిప్‌ కోసం వెళ్లిన స్నేహితులు, గమ్యస్థానం చేరేందుకు దగ్గరి మార్గం కోసం గూగుల్ మ్యాప్స్‌‌పై ఆధారపడితే, చివరకు కారు నివాస సముదాయాలు ఉండే ప్రాంతంలో మెట్లపై ఆగింది. ఈ ఘటన తమిళనాడులోని గడలూర్ వద్ద చోటుచేసుకుంది. తమిళనాడు లోని కొండలూర్‌లోని గడలూర్ వద్ద మెట్లపై కారు చిక్కుకుపోయింది. వీకెండ్ ట్రిప్ కోసం వచ్చిన స్నేహితులు మళ్లీ కర్నాటకు వెళ్లేందుకు దగ్గర మార్గాన్ని ఎంచుకునేందుకు గూగుల్ మ్యాప్స్ వాడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం తమిళనాడు, కేరళ, కర్ణాటక మధ్య ట్రైజంక్షన్‌గా ఉంది. ఈ ప్రాంతం గుండానే చాలా మంది ఊటీకి వెళ్తుంటారు. కారు మెట్లపై ఇరుక్కున్న తర్వాత స్థానికులు, పోలీసులు ప్రధాన రహదారి చేరేందుకు సాయం చేశారు.