Karnataka: ప్రేమించి, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి 12 ఏళ్ల పాటు కాపురం చేసిన ఓ జంట. అయితే, ఆ వివాహిత మరొకరి మీద మోజుపడి కట్టుకున్నోడికి తీరని అన్యాయం చేసింది. అంతే, భర్త గుండె పగిలి ప్రాణాలు తీసుకున్నాడు. తన స్నేహితుడే భార్యను లేపుకెళ్లాడంతో జీవితంపై విరక్తి చెందిన ఆ భర్త సెల్ఫీ వీడియో తీసుకుని.. తన చావుకు పరారైన భార్య, స్నేహితుడే కారణమని వెల్లడించాడు. తనకు న్యాయం చేయాలని ఫ్రెండ్స్ ను కోరుతూ ఫేస్‌బుక్‌లో వీడియో అప్‌లోడ్ చేసి ఉరి వేసుకున్నాడు.
Read Also: Udayanidhi Stalin: మా టార్గెట్ కేంద్రమే.. ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు..
ఈ హృదయ విదారకమైన ఈ ఘటన మంగళవారం నాడు కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా గుబ్బి పట్టణంలోని గట్టి లేఅవుట్ బడావణెలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నాగేష్ (35), 12 ఏళ్ల క్రితం రంజిత అనే యువతిని ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగేష్ ఇటీవల సొంత ఇల్లు విక్రయించి గట్టి లేఅవుట్ బడావణెలో బాడుగ ఇంట్లో ఉంటున్నాడు. అయితే, అతని స్నేహితుడు భరత్.. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ రంజితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇక, ఇటీవల ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో విరక్తి చెందిన నాగేష్.. మిత్రుడు భరత్ తన భార్య రంజితతో అనైతిక సంబంధం పెట్టుకుని, పరారు కావడంతో ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గుబ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.