Site icon NTV Telugu

Bengaluru: బెంగళూర్‌లో దారుణం.. వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన స్కూటర్.. వీడియో వైరల్

Bengaluru Incident

Bengaluru Incident

Man Dragged By Scooter On Bengaluru Road After Accident in bengaluru: న్యూఇయర్ రోజు ఢిల్లీలో ఓ యువతిని కారుతో 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కారుతో ఢీకొట్టి, యువతి కారుకింద చిక్కుకుందని తెలిసినా.. ఆపకుండా అత్యంత పాశవికంగా హత్య చేశారు నిందితులు. ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనలు ఆ తరువాత కూడా జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూర్ లో ఓ వృద్ధుడిని ఢీకొట్టిన తర్వాత తన స్కూటర్ తో ఈడ్చుకెళ్లాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read Also: Minister Roja: హైపర్ ఆదిపై రోజా సెటైర్లు.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో..?

రద్దీగా ఉండే బెంగళూర్ రోడ్డుపై మంగళవారం 71 ఏళ్ల వృద్ధుడిని స్కూటర్ తో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లాడు. స్కూటర్ నడుపుతున్న సాహిల్ అనే వ్యక్తి, ముత్తప్ప అనే వృద్ధుడి కారును ఢీకొట్టాడు. కారు దిగే లోపు స్కూటర్ తో సాహిల్ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ముత్తప్ప స్కూటర్ వెనకభాగాన్ని పట్టుకున్నాడు. ఆ వ్యక్తి మాత్రం ముత్తప్ప పట్టుకున్నా కూడా స్కూటర్ ను పోనిచ్చాడు. వేగం వెళ్తూ.. ముత్తప్ప నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీన్ని వెనక వస్తున్న వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

ద్విచక్ర వాహనం, బొలెరో కారును ఢీకొట్టిన తర్వాత ఈ సంఘటన జరిగిందని డీసీసీ లక్ష్మణ్ నిర్బర్గి తెలిపారు. స్కూటర్ రైడర్ ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈడ్చుకెళ్లబడిన వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరుగుతునందని పోలీసులు తెలిపారు.

Exit mobile version