Man dies while dancing in Gujarat’s Dahod: డాన్స్ చేస్తున్న మరో వ్యక్తి గుండె ఆగింది. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు దేశంలో అక్కడక్కడ జరుగుతున్నాయి. అప్పటి వరకు సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. తాజా మరోసారి ఇలాంటి ఘటనే పునరావృతం అయింది. గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లాలో దేవ్‌గఢ్ బరియా ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
రమేష్ వంజారా (51) కర్రలతో దాండియా ఆడుతూ మరణించాడు. డ్యాన్స్ చేస్తూ అలసిపోయిన అతను అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆస్పత్రికి తీసుకెల్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
Read Also: Gudivada Amarnath: పవన్ కళ్యాణ్‌కి కౌంటర్.. చెప్పులు మా దగ్గర లేవా?
గత 20 ఏళ్లుగా దేశంలో గుండెపోటుతో మరణించే వారి రేటు పెరుగుతోంది. యువతలో కూడా ఈ వ్యాధి మరణాలకు కారణం అవుతోంది. ఇటీవల ఇదే విధంగా గుజరాత్ లో గర్భా చేస్తూ ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఇలా కొద్ది రోజులుగా డ్యాన్స్ చేస్తూ మరణించిన వారి వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.
ప్రజల్లో జీవనశైలి మారడంతో ఇలాంటి గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పౌష్టికాహారం తీసుకోకపోవడం, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, ఒత్తడి, నిద్రలేమి యువతో గుండెపోటుకు కారణం అవుతున్నాయి. జంక్ ఫుడ్, మద్యం, ధూమపానం అలవాట్లు గుండెపోటు తీవ్రతను పెంచుతున్నాయి.
दाहोद में एक कार्यक्रम में डांडिया खेलते–खेलते अचानक युवक की मौत…
अचानक बढ़ रही ये घटनाएं आने वाले किसी बड़े खतरे की घंटी तो नहीं ???#heartattack pic.twitter.com/sFs5X7JMFb— Pooja chaurasiya (@poojach1810) October 17, 2022