NTV Telugu Site icon

Patna: ప్రియుడితో భార్య పారిపోతుండగా భర్త సడన్ ఎంట్రీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

Patna

Patna

భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కట్టుకున్నవారినే కాదని అడ్డదారులు తొక్కుతున్నారు. కలకలం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసి మధ్యలోనే పెడదారి పడుతున్నారు. ఇదంతా ఎందుకుంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

ఒక మహిళ బీహార్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. ఆమె భర్త సీఆర్‌పీఎఫ్ జవాన్‌కు పని చేస్తున్నాడు. అయితే ఆమె.. మరొకరితో వివాహేతర సంబంధం నడుపుతోంది. బుధవారం లింక్ ఎక్స్‌ప్రెస్‌లో సింగ్రౌలీకి ప్రియుడితో పారిపోయేందుకు మహిళ తన ప్రేమికుడితో కలిసి పాట్నా రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఈ సమాచారం తెలుసుకున్న భర్త.. స్టేషన్‌కు వచ్చి ఇద్దర్నీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం ఆమె ప్రియుడ్ని దూరం చేసే ప్రయత్నం చేసింది. కానీ భర్త మాత్రం వదిలిపెట్టలేదు. భార్య ప్రియుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. చుట్టూ ప్రయాణికులు ఉండగానే దాడి చేశారు. అక్కడే ఉన్న కొందరు మొబైల్‌లో షూట్ చేశారు. అనంతరం ప్రియుడి అక్కడ నుంచి పరారయ్యాడు. భార్యను మాత్రం వెంటపెట్టుకుని తీసుకునే వెళ్లే ప్రయత్నం చేసినా.. విడిపించుకుని వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.