Site icon NTV Telugu

Rashmika Mandanna: రష్మిక మందన్న “డీప్‌ఫేక్” వీడియో నిందితుడి అరెస్ట్..

Rashmika Mandanna

Rashmika Mandanna

Rashmika Mandanna: నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా వివాదం సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డీప్‌ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కఠిన చట్టాలు తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఐటీ చట్టంలో కఠిన నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు.

Read Also: KTR: జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దు.. కేటీఆర్ పిలుపు

ఇదిలా ఉంటే రష్మికా మందన్నా వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా ఈ వీడియోను సృ‌ష్టించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. శనివారం ప్రధాన నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లో పట్టుకున్నారు. గతేడాది నవంబర్ 2023లో రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న బ్రిటీష్-ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్ జరాపటేల్ వీడియోకి రష్మికా ముఖంతో మార్ఫింగ్ చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని సెక్షన్లు 465 (ఫోర్జరీ) మరియు 469 (పరువుకు హాని కలిగించడం) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సెక్షన్లు 66C (ఐడెంటిటీ థెఫ్ట్) మరియు 66E (గోప్యతా ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటన తర్వాత కత్రినాకైఫ్, కాజోల్ వంటి వారి డీప్‌ఫేక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ యొక్క డీప్‌ఫేక్ వీడియో ఈ వారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాజాగా ఈ రోజు సోనూసూద్ వీడియో కూడా నెట్టింట ప్రత్యక్షమైంది.

Exit mobile version