NTV Telugu Site icon

Mamta Kulkarni: సన్యాసిగా మారిన మాజీ నటి మమతా కులకర్ణి సంచలన నిర్ణయం..

Mamta Kulkarni

Mamta Kulkarni

Mamta Kulkarni: బాలీవుడ్ ఒకప్పటి అందాల నటి మమతా కులకర్ణి ఇటీవల సన్యాసిగా మారి వార్తల్లో నిలిచారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఆమె సన్యాసిగా మారారు. అయితే, ఆమె తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాధ్విగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు.

Read Also: CM Chandrababu: గత ప్రభుత్వ అక్రమాల విచారణకు బ్యాంకులు సహకరించాలి..

మమతా కులకర్ణికి మహామండలేశ్వర్ పదవిని ఇవ్వడంపై ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి, కిన్నార్ అఖారా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ మధ్య వివాదం నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ‘‘నేను నా చిన్నతనం నుంచి సాధ్విని, అలాగే ఉంటాను’’ అని ఆమె అన్నారు. మమతా కులకర్ణి, తన పేరుని ‘‘శ్రీ యమై మమతా నందగిరి’’గా మార్చుకుని ఆధ్యాత్మిక ప్రపంచ వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించారు.

జనవరి 24న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా కులకర్ణి మహామండలేశ్వర్‌గా గుర్తింపు పొందారు. అయితే, ఆమెకు ఈ పదవిని ఇవ్వడాన్ని యోగా గురువు బాబా రామ్‌దేవ్ కూడా విమర్శించారు. అనేక మంది సాధువులు కూడా దీనిని వ్యతిరేకించారు. ఆమెకు గతంలో నేర చరిత్ర ఉందని ఆయన ఆరోపించారు. అలాంటి వ్యక్తిని మహామండలేశ్వర్‌ బిరుదు ఇవ్వడం ద్వారా మీరు సనాతన ధర్మారానికి ఎలాంటి గురువును అందిస్తారు.? అని చాలా మంది ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.