BJP: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల యువ వైద్యురాలి అత్యాచారం-హత్యపై నిరసనలు ఇప్పటికీ దేశాన్ని కదిలిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని , పోలీసు వ్యవస్థపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష బీజేపీ, సీపీఎంల నుంచి సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
బీజేపీ మమతా బెనర్జీని ‘‘నిర్మమతా బెనర్జీ’’గా పేర్కొంది. ఈ భయంకరమైన సంఘటన తర్వాత ఆమె పేరు మార్చాలని దుయ్యబట్టింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ‘విధ్వంసకురాలి’’గా మారారని అన్నారు. ఆమె తన దుశ్చర్యలతో సమాజానికి సేవ చేస్తున్న ఒక మహిళా డాక్టర్ గౌరవాన్ని నాశనం చేశారని అన్నారు. మమతా బెనర్జీని ‘‘చట్టపాలనని నాశనం చేసే వ్యక్తి’’ అంటూ పేర్కొన్నారు. ‘‘అరాచకవాది మమతా బెనర్జీ. ఈ క్రూరమైన నేరంలో ఆమె సాక్ష్యాధారాలను నాశనం చేసింది..ఆమె తప్పిదాలు చర్యలు మన దేశ రాజ్యాంగాన్ని నాశనం చేశాయి’’ అని అన్నారు.
విద్యార్థుల్ని రక్షించడమే పనిగా పెట్టుకున్న మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ని మమత కాపాడుతున్నారని ఆరోపించారు. ‘‘ఆమె ఒక మహిళ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా నాశనం చేసింది. ఆమె రక్షిస్తానని ప్రమాణం చేసిన రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసింది. ఆమె చట్టం యొక్క పాలనను నాశనం చేస్తోంది మరియు చివరకు కేసులో సాక్ష్యాలను నాశనం చేస్తోంది’’ అని మండిపడ్డారు.
