Mamata Benerjee: ప్రధానిపై మోడీపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధిస్తారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కానీ బెంగాల్ అసెంబ్లీలో మోడీకి మద్దతుగా మాట్లాడడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బెంగాల్ అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మమత.. సీబీఐ, ఈడీకి బయపడి దేశంలోని వ్యాపారస్థులు విదేశాలకు పారిపోతున్న విషయాన్ని ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్‌లో సీబీఐ, ఈడీ దాడులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల వెనుక ప్రధాని మోడీ ఉన్నారని తాను అనుకోవడం లేదని భావిస్తున్నట్లు చెప్పారు.
బీజేపీలోని ఒక వర్గం నేతలు మాత్రమే తమ స్వలాభం కోసం అధికారాన్ని దుర్వినియోం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ హోంశాఖ పరిధిలోకి వస్తుందని, ప్రధాని కార్యాలయానికి దీనితో సంబంధం లేదని చెప్పారు. కొందరు బీజేపీ నేతలు తరచూ హోంమంత్రిని కలిసి తమపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎప్పుడూ మోదీపై విమర్శలు గుప్పించే మమత.. ఇప్పుడు ఆయనకు మద్దతుగా మాట్లాడటం సొంత పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.
Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష పోటీలో శశిథరూర్.. ఓకే చెప్పిన సోనియా!
పశ్చిమ బెంగాల్‌లో సీబీఐ, ఈడీ దాడులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల వెనుక ప్రధాని మోదీ ఉన్నారని తాను అనుకోవడం లేదని చెప్పారు. భాజపాలోని ఒక వర్గం నేతలు మాత్రమే తమ స్వలాభం కోసం అధికారాన్ని దుర్వినియోం చేస్తున్నారని ఆరోపించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థల మితిమీరిన జోక్యం చేసుకుంటున్నాయంటూ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అజెండాను, పార్టీ ప్రయోజనాలను కలిపి చూడొద్దని ఈ సందర్భంగా ప్రధాని మోడీని మమత కోరారు. ఇది ఏ ఒక్కరినీ వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం కాదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ప్రవేశపెట్టినట్టు మమత పేర్కొన్నారు. రాష్ట్రంలో పలువురు నేతలపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టీఎంసీ నేతలు నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా ఈ తీర్మానం ప్రవేశపెట్టారు.
మమత వ్యాఖ్యలపై బీజేపీ నేత సువేంధు అధికారి స్పందించారు. బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్లుడు అభిషేక్ బెనర్జీని కాపాడుకునేందుకే ఆమె ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మమత కుతంత్రాలను బీజేపీ ఆ మాత్రం పసిగట్టలేదా అని సెటైర్లు వేశారు.
