Site icon NTV Telugu

Mamata Banerjee: ముస్లిం పెద్దలతో భేటీ కానున్న సీఎం మమత

Mamatabanerjee

Mamatabanerjee

వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చాక బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హింస చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల కొద్దీ గాయాలు పాలయ్యారు. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ముర్షిదాబాద్‌లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం మతాధికారులతో భేటీ కావాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Trump : అతిథి పాత్రలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

బుధవారం నేతాజీ ఇండోర్ స్టేడియంలో ముస్లిం మతాధికారులు, ఇమామ్‌లు, ముజ్జిన్‌లు, ముస్లిం మేధావులతో మమతా బెనర్జీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని మమత చెప్పారు. అయినా కూడా అల్లర్లు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంపాదించుకుంది. ఈ సమావేశాల బాధ్యతను కోల్‌కతా మేయర్, ముస్లిం సమాజానికి చెందిన సీనియర్ టీఎంసీ నేత ఫిర్హాద్ హకీమ్‌కు అప్పగించారు.

ఫిర్హాద్ హకీమ్‌ మాట్లాడుతూ.. మమత ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ముస్లిం సమాజానికి ఏం కాదని భరోసా ఇచ్చారు. మైనార్టీలు సురక్షితంగా ఉంటారని హామీ ఇచ్చారు. వీధుల్లో పోరాటం వల్ల ఏ ప్రయోజనం ఉండదని.. సుప్రీంకోర్టులో న్యాయం జరగాలన్నారు.

ఇది కూడా చదవండి: Rape Case: ఛీ.. ఛీ.. వీడసలు తండ్రేనా.. కన్న కూతురిపై అఘాయిత్యం!

Exit mobile version