Mamata Banerjee: ఒక్క ఆడదానిపై 19 రాష్ట్రాలు, కేంద్రం పని చేస్తున్నాయి.. యోధురాలిగా పోరాడతానన్న మమత

  • ఒక్క ఆడదానిపై 19 రాష్ట్రాలు, కేంద్రం పని చేస్తున్నాయి
  • యోధురాలిగా పోరాడతానన్న మమత
  • విషపు కళ్లతో చూస్తే కళ్లు పీకేస్తానని వార్నింగ్
Mamata Banerjee1

Mamata Banerjee1

తనకు వ్యతిరేకంగా 19 రాష్ట్రాలు, కేంద్రం పని చేస్తున్నాయని.. అయినా కూడా ఒంటరి యోధురాలిగా పోరాడతానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్భూమ్ జిల్లాలోని సూరిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఢిల్లీ బలంతో బెంగాల్ ప్రజలను ప్రభావితం చేసి ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 226కు పైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా 19 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఏకమయ్యాయని, కానీ తాను మాత్రం సామాన్య ప్రజల హక్కుల కోసం ఒంటరిగా పోరాడుతున్నానని తెలిపారు. అయినా ఢిల్లీ శక్తితో బెంగాల్‌ను గెలవలేరన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే బయటి శక్తులు, వనరుల సహాయంతో బెంగాల్ ప్రజలను ప్రభావితం చేయడం అంత సులభం కాదని పేర్కొన్నారు. బెంగాల్‌ను విషపు కళ్లతో చూస్తే.. మీ కళ్లు పీకేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు.

మన్ కీ బాత్‌పై విమర్శలు..
మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంపై మమతా బెనర్జీ ప్రశ్నలు లేవనెత్తారు. యువత మనసులను ప్రభావితం చేయడానికి ఈ కార్యక్రమాన్ని వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ‘మన్ కీ బాత్ ద్వారా యువతను ప్రభావితం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది, కానీ బెంగాల్ యువతకు సత్యాసత్యాల మధ్య తేడా తెలుసు, వారు చైతన్యవంతులు’’ అని అన్నారు.

 

ఇది కూడా చదవండి: Anant Ambani: గ్రాండ్‌గా అనంత్ అంబానీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియోలు వైరల్