Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Mamata Banerjee Says Will Not Accept Supreme Court Verdict On Teachers Appointment

Mamata Banerjee: సుప్రీంకోర్టు తీర్పును ఏ మాత్రం అంగీకరించను.. టీచర్లకు మమత మద్దతు

Published Date :April 7, 2025 , 12:59 pm
By Suresh Maddala
  • సుప్రీంకోర్టు తీర్పును ఏ మాత్రం అంగీకరించను
  • జైలుకెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నా
  • ఉపాధ్యాయులకు మమతా బెనర్జీ మద్దతు
Mamata Banerjee: సుప్రీంకోర్టు తీర్పును ఏ మాత్రం అంగీకరించను.. టీచర్లకు మమత మద్దతు
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమ బెంగాల్‌లో 25,000 టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దీంతో వాళ్లంతా రోడ్డున పడ్డారు. సుప్రీం ధర్మాసనం తీర్పుపై ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. తనను జైల్లో పెట్టినా పర్వాలేదు.. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించబోనని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఉపాధ్యాయులకు మమత మద్దతు ప్రకటించారు. దు:ఖంతో హృదయం రాయిలా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడుతున్నందుకు తనను జైల్లో పెట్టొచ్చన్నారు. తాను బతికున్నంత వరకు ఎవరూ ఉద్యోగం కోల్పోరని హామీ ఇచ్చారు. అర్హులైన ఉపాధ్యాయులకు ఎలాంటి భయం అక్కర్లేదని.. వారి ఉద్యోగాలను కాపాడే బాధ్యత తనదేనని మమత ప్రతిజ్ఞ చేశారు. తనను ఎవరైనా సవాల్ చేస్తే.. వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో తనకు బాగా తెలుసన్నారు. ఇది ‘నా నిబద్ధత’ అన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని.. అర్హులైన ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఎక్కడికి పోవన్నారు.

గత వారం సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 25,000 మంది ఉపాధ్యాయ నియామకాలను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టింది. స్కూల్ సర్వీస్ కమిషన్ కింద 25,000 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు గత గురువారం సమర్థించింది. ఈ ప్రక్రియ అంతా మోసం.. ద్రోహంతో తారుమారు చేయబడిందని అభిప్రాయపడింది. ఈ నియామకానికి విశ్వసనీయత లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

హైకోర్టు నిర్ణయంలో ఎలాంటి తప్పు కనిపించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి పీవీ. సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నియామకాలన్నీ మోసపూరితంగా జరిగాయని తెలిపింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు కొన్ని మార్పులు చేసింది. 2016లో నియామకం అయినప్పటి నుంచి పొందిన జీతాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం సుప్రీం ధర్మాసనం సవరించింది. అలా జీతం ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్పీంకోర్టు స్పష్టం చేసింది. ఇక మూడు నెలల్లోపు కొత్త ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.

తాజాగా సుప్రీంకోర్టు తీర్పును మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ తీర్పును అంగీకరించబోనని ప్రతిజ్ఞ బూనారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mamata Banerjee
  • Not accept
  • Supreme Court verdict
  • Teachers appointment
  • West Bengal

తాజావార్తలు

  • Vivo V70 FE: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. వివో V70 FE రిలీజ్ కు రెడీ

  • Markapuram Bus Accident: మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, జగన్‌, లోకేష్‌ సహా నేతల దిగ్భ్రాంతి

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • Love Couple Arrested: వరుస దొంగతనాలు.. ప్రేమ జంట అరెస్ట్.. స్టోరీ తెలిస్తే షాకే..!

  • Iran: ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ ప్రకటన.. హోర్ముజ్ తర్వాత మరో ముప్పు.. చమురు సంక్షోభం తప్పదా?

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions