Site icon NTV Telugu

Mamata Banerjee: తీవ్ర షాకయ్యా.. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తునకు మమత డిమాండ్

Mamata Banerjee

Mamata Banerjee

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణ వార్తతో తీవ్ర షాక్‌కు గురైనట్లు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అజిత్ పవార్ ఆకస్మిక మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘పవార్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా. ఆయన అభిమానులకు, కార్యకర్తలకు సానుభూతి తెలియజేస్తున్నా.. ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు జరపాలి. సరైన దర్యాప్తు అవసరం.’’ అని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి విమానంలో బయల్దేరారు. అయితే ఉదయం 8:45 గంటలకు ల్యాండింగ్ సిద్ధపడుతున్న క్రమంలో ఒక్కసారిగా కూలిపోయింది. విమానం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. ఈ వార్త అజిత్ పవార్ అభిమానులను, కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక అజిత్ పవార్ మృతి పట్ల సినీ, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు.

 

Exit mobile version