Site icon NTV Telugu

West Bengal: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ఉండదు.. తేల్చేసిన సీఎం మమత

Mamata Banerjee

Mamata Banerjee

పశ్చిమ బెంగాల్‌లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్.. ప్రస్తుతం ఇండియా కూటమిలోనే ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పొత్తు ఉండబోదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మమత ప్రసంగించారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఏమీ లేదని.. ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆప్‌కు కాంగ్రెస్ సాయం చేయలేదని.. హర్యానాలో కాంగ్రెస్‌కు ఆప్ సాయం చేయలేదని.. ఇలా రెండు రాష్ట్రాల్లో ఒకరికొకరు సాయం చేసుకోకపోవడం వల్లే బీజేపీ గెలిచిందని చెప్పారు.

ఇది కూడా చదవండి: Chilukuru Balaji Temple Priest: రంగరాజన్‌ను పరామర్శించిన ఈటల.. అండగా ఉంటామని హామీ!

2026లో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ సహా ఇతర ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని.. సంకీర్ణానికి అవకాశమే లేదని సీఎం మమత తేల్చి చెప్పేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజార్టీతో గెలవబోతున్నట్లు మమత విశ్వాసం వ్యక్తం చేశారు. వరుసగా నాలుగో సారి బెంగాల్‌లో తృణమూల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడం ఇండియా కూటమికి కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. అయినా ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి: West Bengal: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ఉండదు.. తేల్చేసిన సీఎం మమత

Exit mobile version