పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పోరాటానికి సిద్ధమవుతున్నారు. ‘‘SIR’’పై కేంద్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మమత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వచ్చే వారం ఢిల్లీలో భారీ కవాతు నిర్వహించేందుకు ప్రణాళిక రచించినట్లు వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Bihar: నితీష్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వోద్యోగులపై సోషల్ మీడియా బ్యాన్
త్వరలోనే బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక సర్వే నిర్వహించింది. దీంతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించింది. అప్పటి నుంచి ఎన్నికల సంఘానికి… కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఎంసీ విమర్శలు చేస్తోంది. అక్రమంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపించింది. ఇక ఈ కేసు వచ్చే వారం సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ లేదా సుప్రీంకోర్టు, జంతర్ మంతర్ వరకు మమతా బెనర్జీ ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉందని వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చదవండి: UK-China: 10 ఒప్పందాలపై యూకే-చైనా సంతకాలు.. దేనికి సంకేతాలు!
ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకు మమతా బెనర్జీకి.. ఇద్దరు సహచరులతో ప్రధాన ఎన్నికల కమిషనర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1 సాయంత్రం లేదా ఫిబ్రవరి 2న తెల్లవారుజామున మమత ఢిల్లీకి చేరుకుంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో SIR సమస్యను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి మమతా బెనర్జీ మాస్టర్ ప్లాన్ చేస్తున్నారని వర్గాలు చెబుతున్నాయి. పెద్ద ఎత్తున జనసముహాన్ని కూడబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక సుప్రీంకోర్టు వచ్చే వారం SIR అంశాన్ని విచారించే అవకాశం ఉంది. విచారణ సమయంలో మమతా బెనర్జీ కూడా హాజరు కావచ్చని ఊహాగానాలు ఉన్నాయి. మమతా బెనర్జీ న్యాయవాది కాబట్టి స్వయంగా వాదించే అవకాశం ఉంది.
