NTV Telugu Site icon

Kolkata: 2 గంటలు సీఎం మమత నిరీక్షణ.. చర్చలకు రాని డాక్టర్లు.. రాజీనామాకు రెడీ అంటూ ప్రకటన!

Kolkata

Kolkata

ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జూనియర్ డాక్టర్ల చర్చలపై ప్రతిష్టంభన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని డాక్టర్లకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే షరతులతో కూడిన ఆహ్వానం పంపించింది. దీంతో వైద్యులు చర్చలకు వచ్చేందుకు నిరాకరించారు. ముఖ్యమంత్రి మమత మాత్రం సెమినార్ హాల్‌కు వచ్చేశారు. దాదాపు వైద్యుల కోసం 2 గంటల పాటు నిరీక్షించారు. కానీ ఎవరూ రాలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోను తృణమూల్ కాంగ్రెస్ పోస్టు చేసింది. అంతేకాకుండా మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘‘నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని పెద్ద ప్రకటన చేశారు. ఒక హాలులో ఒంటరిగా కూర్చుని జూనియర్ డాక్టర్ల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు.

ఇది కూడా చదవండి: KA Movie: ఆకట్టుకుంటున్న అందాల రాశి “తన్వీ రామ్”.. “క” లో రాధ క్యారెక్టర్ ఫస్ట్ లుక్

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కోల్‌కతాలో జూనియర్ వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. విధులు బహిష్కరించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశించినా నిరసనలు కొనసాగించారు. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది. వైద్యులు కూడా ప్రభుత్వ ఆహ్వానాన్ని అంగీకరించి.. షరతులతో కూడిన లేఖను ప్రభుత్వానికి పంపించారు. చర్చలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రావాలని.. అలాగే 30 మంది డాక్లర్లు వస్తారని.. చర్చలకు సంబంధించిన విషయాలను లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: BJP: సీజేఐ ఇంట్లో “గణపతి పూజ”కు పీఎం మోడీ.. విమర్శలకు “ఇఫ్తార్ విందు”తో బీజేపీ సమాధానం..

డాక్టర్ల షరుతపై ప్రభుత్వం స్పందించింది. గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని డాక్టర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. కేవలం 15 మంది రావాలని.. నబన్నలోని సెమినార్ హాల్‌కు రావాలని పిలిచింది. ప్రత్యక్ష ప్రచారం ఉండబోదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని లేఖలో సర్కార్ పేర్కొంది. సామాన్య ప్రజలకు చికిత్స, ఆరోగ్య సేవలను పునరుద్ధరించడానికి జూడాలు సమావేశానికి రావాలని కోరింది. చర్చలు సజావుగా సాగేలా కేవలం 15 మంది మాత్రమే రావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే ప్రభుత్వ చర్చలపై జూనియర్ డాక్టర్లు ముందుకు రాలేదు. ప్రభుత్వ షరతులను నిరాకరించారు. సీఎం మమత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ.. సెమినార్ హాల్‌కు వచ్చినా వైద్యులు మాత్రం రాలేదు. దీంతో చర్చలపై ప్రతిష్టంభన చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: PM Modi: సీతారాం ఏచూరి మృతికి ప్రధాని మోడీ సంతాపం

అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం.. సీఎం మమత వెయింటింగ్ చేస్తున్న ఫొటోను పోస్టు చేస్తూ కీలక కామెంట్లు చేసింది. జేఎన్‌యూ నుంచి రైతుల నిరసన వరకు, రెజ్లర్ల నిరసన నుంచి మణిపూర్ వరకు ఏ రోజైనా ప్రజాస్వామ్య చర్చలకు మోడీ ప్రభుత్వం పిలిచిందా? అసమ్మతిని పట్టించుకుందా? అని నిలదీసింది. ఇదే తేడాను జూనియర్ డాక్టర్లు గుర్తించుకోవాలని టీఎంసీ కోరింది.

 

Show comments