Mamata Banerjee: “మాజీ సీఎం కాదట”.. మమతా బెనర్జీ వ్యూహాం..

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం తొలిసారి ఏర్పడింది. సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సమా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు మమతా బెనర్జీకి సంబంధించిన ఒక వార్త హైలెట్ అవుతోంది. ఓడిపోయినా, ఆమె ఓటమిని అంగీకరించలేదని తెలుస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకు ఆమె ఎక్స్ బయోలో ‘‘గౌరవనీయ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్’’ అని పేర్కొంది. సువేందు అధికారి బెంగాల్ సీఎం అయిన తర్వాత కూడా ఆమె తన బయోలో మాజీ ముఖ్యమంత్రి అని కాకుండా ‘‘ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ శాసన సభలు) అని మార్చారు. అంతేకాకుండా తన బయోలో తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పేర్కొన్నారు. అధికారం పోయినప్పటికీ ఆమె తన బయోలో ‘‘మాజీ సీఎం’’ అని చేర్చడానికి ఇష్టపడలేదు.

దీనికి ప్రధాన కారణంగా ఆమె తన గుర్తింపును వదులుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఎన్నికల ముగిసిన తర్వాత, తానే విజయం సాధించినట్లు చెప్పుకుంది. 100 స్థానాల్లో బీజేపీ తమ విజయాన్ని దోచుకుందని ఆరోపించింది. తాను సీఎంగా రాజీనామా చేయనని చెప్పింది. ఈ నేపథ్యంలో మాజీ అని మార్చుకుంటే తాను చేసిన ఆరోపణలకు విలువ లేకుండా పోతుందనే ఉద్దేశంతో మమతా ఇలా చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

×
×
Ad

మరోవైపు, తన నుంచి అధికారాన్ని లాగేసుకున్నారనే సింపతీని క్రియేట్ చేయడానికి దీదీ జనాల్లోకి వచ్చే అవకాశం ఉంది. తన ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేసినట్లు ఆరోపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తాను మాజీగా ఉండబోనని చెబుతూనే, ఎక్స్ బయోలో ‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి’’ అనే పదాన్ని అలాగే ఉంచింది. ఇదే సమయంలో ఘోర పరాజయంతో తృణమూల్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఇక మాజీ అని చేరిస్తే కార్యకర్తల స్థైర్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. దీంతోనే ఎంతో కొంత ఉపశమనం కోసం ముఖ్యమంత్రి అనే పదాన్ని అలాగే ఉంచింది. ఇప్పటికీ, బీజేపీ అధికారంలోకి రావడంతో టీఎంసీ కార్యకర్తల్లో భయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మమతా ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందని చెబుతున్నారు.