Mamata Banerjee: బీజేపీ చెప్పినట్లు చేసేవారిని నియమించారు.. బెంగాల్ అధికారుల మార్పుపై మమతా ఫైర్..
- ఎన్నికలకు ముందు మమతా వర్సెస్ ఈసీ..
- అధికారుల బదిలీపై బెంగాల్ సీఎం తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత బెంగాల్ వ్యాప్తంగా కీలక అధికారుల్ని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. కీలకమైన డీజీపీ, సీఎస్, కోల్‌కతా పోలీస్ కమిషనర్ వంటి పోస్టుల్లో పనిచేస్తున్న వారిని తొలగించి, వేరే వారికి బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు, ఇది రాజకీయ వివాదంగా మారింది. ఈసీ నిర్ణయంపై తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.
Read Also: Al-Aqsa Mosque: రంజాన్ మాసంలో పవిత్ర ‘‘అల్-అక్సా మసీదు’’ మూసివేత.. ముస్లిం దేశాల ఆగ్రహం..
Also Read
- Bhojshala case: "భోజ్‌శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులను తొలగించడాన్ని నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు లేఖ రాశారు. ఈ చర్యలు ‘‘ఏకపక్షమైనవి’’, ‘‘తీవ్ర ఆందోళన కలిగించే విషయాలు’’ అని ఆమె పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ఏకపక్ష చర్యలు తీసుకోకుండా ఉండాలని ఆమె లేఖలో రాశారు. ఇలాంటి మార్పులు చేసే అధికారం కమిషన్‌కు ఉన్నప్పటికీ, గత ఎన్నికల సమయంలో “రాజ్యాంగ సముచితం, పరిపాలనా సంప్రదాయం ప్రకారం వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు” అని బెనర్జీ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం చర్య ఎన్నికల సంఘం విశ్వసనీయత, సంస్థాగత సమగ్రతను నీరుగార్చే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. ఇది రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘిస్తుందని చెప్పారు.
ఎన్నికల తేదీలను ప్రకటించిన కొద్దిసేపటికే, ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి, రాష్ట్ర పోలీసు అధిపతి పీయూష్ పాండే, కోల్‌కతా పోలీసు కమిషనర్ సుప్రతీమ్ సర్కార్, పశ్చిమ బెంగాల్ హోం కార్యదర్శి జగదీష్ ప్రసాద్ మీనాలను ఎన్నికల సంఘం తొలగించింది. దీనిపై మమతా బెనర్జీ ఆగ్రహంగా ఉన్నారు. ఇదే కాకుండా ఈ అధికారులకు ఎలాంటి ఎన్నికల బాధ్యతలు అప్పగించవద్దని ఎన్నిక సంఘం ఆదేశించింది. సమర్థులైన బెంగాలేతర అధికారుల్ని కూడా ఈసీ తొలగించిందని, కేవలం బీజేపీ చెప్పినట్లు నడుచుకునే వారిని మాత్రమే ఎంపిక చేసిందని మమతా బెనర్జీ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Bhojshala case: “భోజ్‌శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్‌లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!