Mallikarjuna Kharge On Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నో రోజులు లేని పక్షంలో.. రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి. ముఖ్యంగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలైతే ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించాలని కృత నిశ్ఛయంతో కాంగ్రెస్ ఉందని, తీరక సమయం లేకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని అన్నారు. ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే.. అందుకే తనదే పూర్తి నైతిక బాధ్యత అని ప్రకటించారు. ఈమేరకు ఆయన ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
WhatsApp Loan: వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పెట్టండి.. రూ.10 లక్షల లోన్ పొందండి
కర్ణాటక ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఖర్గే.. ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తామని, ఈసారి హంగ్ వచ్చే పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు. తాను రోజూ నాలుగు ర్యాలీల్లో పాల్గొంటున్నానని, ఒక్కోసారి 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. బీజేపీని ఎలాగైనా ఓడించాలని అకింతభావంతో ఉన్నామని, అందుకే ఎన్ని సవాళ్లనైనా అధిగమిస్తున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విస్పష్ట మెజారిటీతో పగ్గాలు చేపడుతుందని, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. ఎన్నికల్లో గెలవాలనే సంకల్పం, నిబద్ధత ఉండాలని అన్నారు.
PM Bengaluru Roadshows: పీఎం బెంగళూరు రోడ్‌షోలో మార్పులు.. కారణమిదే!
కాగా.. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. కర్ణాటకలో 58282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని స్థానాలకు కలిపి పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం సన్నాహాలు పూర్తి చేస్తున్న కమిషన్.. భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.