Site icon NTV Telugu

Jammu Kashmir Assembly Polls: నేడు జమ్మూకశ్మీర్కు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే

Rahul

Rahul

Jammu Kashmir Assembly Polls: నేటి నుంచి రెండ్రోజుల పాటు జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జమ్మూ, శ్రీనగర్‌లోని పార్టీ కీలక నేతలతో పాటు పార్టీ శ్రేణులతో వారు సమావేశం కానున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాల కోసం తీసుకు కోవాల్సిన చర్యలపై వారితో వీరిరువురు చర్చించనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా తెలిపారు. నేటి (బుధవారం) మధ్యాహ్నం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ జమ్మూకు చేరుకుంటారు. ఆ తర్వాత వారు.. పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు.

Read Also: Nithin: హ్యాట్రిక్ పై కన్నేసిన కుర్ర హీరో.. దసరా బరిలో ఆగస్టు 15 విన్నర్..?

ఇక, ఆ తర్వాత శ్రీనగర్ లో సైతం కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలతో కాంగ్రెస్ పార్టీ జత కట్టే అవకాం ఉందని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. అధికారంలోకి రాకుండా భారతీయ జనతా పార్టీని నియంత్రించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు నాలుగు రాష్ట్రాలు.. హరియాణ, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, స్ర్కీనింగ్ కమిటీ సభ్యులతో సోమవారం న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమావేశమై చర్చించారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మూడు విడుతల్లో జరగబోతుంది. అందులోభాగంగా తొలి విడత నోటిఫికేషన్ మంగళవారం ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఆక్టోబర్ 4న వెలువడనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ లో జరగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి.

Read Also: Road Accident: తాడిపత్రిలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

అయితే, ఈ నేపథ్యంలో అధికారాన్ని హస్త గతం చేసుకునేందుకు అటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీలే కాకుండా.. ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు సైతం మాస్టర్ ప్లాన్స్ తో ముందుకు వెళ్తున్నాయి. ఇంకోవైపు బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

Exit mobile version