Site icon NTV Telugu

Mallikarjun Kharge: మోడీ ప్రభుత్వం దేశ ప్రజల్నితప్పుదారి పట్టించింది.. సీడీఎస్ ప్రకటనపై ఖర్గే..

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge: ఇటీవల పాకిస్తాన్‌పై భారత్ జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’లో కొన్ని వైమానిక నష్టాలు కలిగినట్లు ఈ రోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ అంగీకరించారు. తప్పులను సరిదిద్దుకున్న తర్వాత వ్యూహాత్మకంగా పాకిస్తాన్‌లోకి వెళ్లి దాడులు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని సీడీఎస్ చెప్పిన కొన్ని గంటల తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే, ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై దాడి చేశారు. ప్రభుత్వం ఈ దేశాన్ని తప్పుదారి పట్టించిందని ఆరోపించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Read Also: Operation Sindoor: భారత్‌కి వైమానిక నష్టాలు ఉన్నాయి.. పాక్‌లోకి వెళ్లి దాడులు చేశాం: సీడీఎస్..

‘‘సింగపూర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, అడగవలసిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేస్తేనే వీటిని అడగవచ్చు. మోడీ ప్రభుత్వం దేశాన్ని తప్పుదారి పట్టించింది. యుద్ధంపై నిజాలు ఇప్పుడు తెలుస్తున్నాయి’’ అని ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కార్గిల్ సమీక్ష కమిటీ తరహాలో స్వతంత్ర నిపుణుల కమిటీ ద్వారా రక్షణ సంసిద్ధతపై సమగ్ర సమీక్షకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

Exit mobile version