Site icon NTV Telugu

Congress Presidential Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ముక్కోణపు పోటీ.. రేసులో ఖర్గే!

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Congress Presidential Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. నామినేషన్‌ దాఖలుకు నేడు చివరిరోజు కాగా.. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే అధ్యక్ష పోటీలో నిలవనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ హైకమాండ్ మద్దతుతో అధికారిక అభ్యర్థిగా ఎంపికైనట్లు తెలిపాయి. అక్టోబరు 17న జరిగే ఎన్నికలకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్‌లతో కలిసి మూడో అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. ముందు నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రేసులో ముందుంటారని భావించినప్పటికీ.. ఊహించని విధంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతానికి పార్టీ సీనియర్ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్‌లు బరిలో నిలుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Vande Bharat Express: నేడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న ప్రధాని

ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్‌లు నామినేషన్‌ పత్రాలను ఇవాళ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష పోటీలో నిలిచేందుకు నామినేషన్‌ పత్రాలను శశిథరూర్ వారం రోజుల క్రితమే తీసుకోగా.. దిగ్విజయ్ సింగ్ గురువారం తీసుకున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి విషయంలో శుక్రవారం కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 8వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ. అంతిమంగా ఎవరు పోటీలో ఉంటారో అక్టోబరు 8న స్పష్టం అయ్యే అవకాశం ఉంది. అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరుగుతాయి.

Exit mobile version