NTV Telugu Site icon

Congress: ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ ఎంపికలో సరైన విధానాన్ని పాటించలేదు..

Kharge

Kharge

Congress: జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ను ఎంపిక అయ్యారు. అయితే, ఛైర్మన్ ఎంపికలో సరైన విధానాన్ని పాటించలేదని కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియ ప్రైమరీ స్థాయిలోనే లోపభూయిష్టంగా కొనసాగిందని అసమ్మతిని ఏఐసీసీ చీఫ్ ఖర్గే వ్యక్తం చేసింది. కాగా, ఇలాంటి అంశాల్లో పరస్పర సంప్రదింపులతో పాటు ఏకాభిప్రాయం లాంటి సంప్రదాయాన్ని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. చట్టబద్ధమైన ఆందోళనలను పక్కన పెట్టి, పేర్లను ఖరారు చేయబడానికి సంఖ్యాపరమైన మెజార్టీపై ఆధారపడిందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

Read Also: Daggubati Purandeswari: అంబేద్కర్‌ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ: పురందేశ్వరి

అయితే, ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ గా విధులు నిర్వహించిన జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా 2024 జూన్‌ 1వ తేదీన పదవీ విరమణ చేశారు. ఇక, సభ్యురాలు విజయభారతీ సయానీ ప్రస్తుతం తాత్కాలిక ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. కొత్త ఛైర్‌పర్సన్‌ ఎంపికపై డిసెంబర్‌ 18న ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, సభ్యులుగా ప్రియాంక్‌ కనూంగో, డాక్టర్‌ జస్టిస్‌ బిద్యుత్‌ రంజన్‌ షడంగిలను కేంద్రం ఎంపిక చేసింది.

Show comments