NTV Telugu Site icon

Mallikarjun Kharge: ఎర్రకోట స్వాతంత్ర్య వేడుకలకు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే దూరం .. ఎక్స్ లో సందేశం పోస్టు

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge: ఎర్రకోటలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జన ఖర్గే గౌర్హాజరయ్యారు. ఎర్రకోటలోని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఖర్గే హాజరు కాకపోవడానికి కారణాలను కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ.. ఆరోగ్యం బాగా లేక తాను హాజరు కాలేదని ఖర్గే తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఎర్రకోట‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుక‌ల‌కు ఖ‌ర్గే హాజ‌రుకాకపోవడంతో.. ఆయ‌న కోసం వేసిన కుర్చీ ఖాళీగా కనిపించింది. ప్రధాని మోదీ ప్రసంగానికి ఆయ‌న హాజరు కాకపోయినప్పటికీ ఖ‌ర్గే త‌న ట్విట్టర్ అకౌంట్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు.

Read also: Match Fixing: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. దేశం దాటకుండా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్‌పై నిషేధం!

77వ స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా ఎర్రకోట‌పై జెండా ఎగుర‌వేసిన త‌ర్వాత ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అతిథులు అంద‌రూ వ‌చ్చినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే హాజ‌రుకాలేదు. దీంతో ఆయన కోసం కేటాయించిన కుర్చీ ఖాళీగా క‌నిపించింది. ట్విట్టర్ ఖాతా లో ఓ వీడియో మెసేజ్ చేసిన ఖ‌ర్గే.. ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మన దేశానికి ఆత్మ. దేశం ఐక్యత, సమగ్రత కోసం, ప్రేమ, సోదరభావం కోసం, సామరస్యం కోసం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం స్వేచ్ఛను మేము సమర్థిస్తామని మేము ఈ ప్రమాణం చేస్తున్నామని ఖర్గే పేర్కొన్నారు. గ‌త ప్రధానులు దేశాన్ని తీర్చిదిద్దన వైనాన్ని తమ ప్రసంగాల్లో వెల్లడించారని గుర్తు చేశారు. ఆరోగ్యం స‌రిగా లేని కార‌ణంగా స్వాతంత్య్ర వేడుక‌ల‌కు హాజ‌రుకాలేద‌ని చెప్పిన ఖ‌ర్గే.. త‌న మెసేజ్‌లో గాంధీ, నెహ్రూ, సర్థార్‌ వ‌ల్లభాయ్ ప‌టేల్‌, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, మౌలానా ఆజాద్‌, రాజేంద్ర ప్రసాద్‌, స‌రోజిని నాయుడు, అంబేద్కర్‌ లకు నివాళి అర్పించారు. భార‌త తొలి ప్రధాని నెహ్రూతో పాటు ఇందిరా గాంధీ, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, పీవీ న‌ర్సింహారావు, మ‌న్మోహ‌న్ సింగ్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయి దేశానికి చేసిన మేలు గురించి వివ‌రించారు. ప్రతి ప్రధాని దేశ ప్రగ‌తి కోసం ఎంతో కొంత స‌హ‌క‌రించార‌ని, కానీ ఈ రోజుల్లో కొంద‌రు మాత్రం గ‌త కొన్నేళ్లలోనే దేశం ప్రగ‌తి సాధించిన‌ట్లు చెబుతున్నారని విమర్శించారు. ప్రతిప‌క్షాల గొంతును నొక్కేందుకు కొత్త విధానాల‌ను వాడుతున్నార‌ని.. సీబీఐ, ఈడీ, ఐటీతో దాడులు చేయిస్తున్నార‌ని, ఎన్నిక‌ల సంఘాన్ని బ‌ల‌హీన‌ప‌రిచార‌ని, విప‌క్ష గొంతులను నొక్కుతున్నార‌ని, వాళ్ల మైక్‌ల‌ను లాగేసి స‌స్పెండ్ చేస్తున్నార‌ని ఖ‌ర్గే మండిపడ్డారు.