NTV Telugu Site icon

Allahabad High Court: “ఎప్పుడూ మగవారిదే తప్పు కాదు”.. రేప్ కేసులో సంచలన తీర్పు..

High Court

High Court

Allahabad High Court: పెళ్లి పేరుతో ఓ మహిళపై అత్యాచారం చేశాడని అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది అలహాబాద్ హైకోర్టు. తీర్పు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక నేరాలకు సంబంధించి చట్టం సరైనదేనని, అయితే ప్రతీసారి మగవారిదే తప్పు అని అర్థం కాదని పేర్కొంది. న్యాయమూర్తులు రాహుల్ చతుర్వేది, జస్టిస్ నంద్ ప్రభా శుక్లాతో కూడిన డివిజనల్ బెంజ్, ఈ వ్యవహారంలో ఇద్దరి తప్పు ఉందని పేర్కొంది.

‘‘నిస్సందేహంగా, చాప్టర్ XVI (ఆన్) ‘లైంగిక నేరాలు’ అనేది ఒక మహిళ మరియు అమ్మాయి యొక్క గౌరవం మరియు గౌరవాన్ని కాపాడటానికి స్త్రీ-కేంద్రీకృత చట్టం,కానీ పరిస్థితులను అంచనా వేసేటప్పుడు, ఇది పురుషుడు తప్పుమాత్రమే కాదని, భాగస్వామి తప్పు కూడా ఉంది, ఇద్దరి తప్పు ఉంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

అత్యాచారం కేసులో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఫిర్యాదుదారు చేసిన అప్పీల్‌ని కోర్టు విచారించింది నిందితుడిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989 కింద ఛార్జిషీట్ దాఖలైంది. 2019లో నిందితుడు పెళ్లి చేసుకుంటానని తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, అయితే ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని సదరు మహిళ ప్రయాగ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కులం గురించి కించపరిచేలా మాట్లాడాడని ఆమె పేర్కొంది. విచారణ అనంతరం 2020లో నిందితుడిపై ఛార్జిషీట్ దాఖలైంది.

Read Also: Jayam : 22 ఏళ్లు పూర్తి చేసుకున్న నితిన్ క్లాసిక్ మూవీ..

ప్రయాగ్‌రాజ్‌లోని ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 8, 2024న అత్యాచారం అభియోగం కింది నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. కేవలం ఐపీసీ సెక్షన్ 323 కింద గాయపరడం అభియోగం కింద అతడిని దోషిగా నిర్ధారించింది. దీంతో మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసును విచారించిన కోర్టు, ఇద్దరి మధ్య సంబంధం ఏకాభిప్రాయంతో కుదిరినట్లు గుర్తించింది. మహిళది యాదవ కులం కాదని తెలిసిన తర్వాత అతను ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. సదరు మహిళ 2010లో ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న విషయాన్ని కూడా దాచిపెట్టినట్లు, భర్తకు రెండేళ్లుగా దూరంగా ఉన్నట్లు కోర్టు గుర్తించింది.

ట్రయల్ కోర్టు సదరు వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించడాన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. పెళ్లై, అంతకుముందు వివాహాన్ని రద్దు చేసుకోకుండా, కులాన్ని దాచిపెట్టి మహిళ ఎలాంటి అభ్యంతరం లేకుండా ఐదేళ్ల పాటు శారీరక సంబంధాన్ని కొనసాగించిన విసయాన్ని తేలికగా ఊహించవద్దని కోర్టు పేర్కొంది. ఇద్దరూ అలహాబాద్, లక్నోలని అనేక హోటళ్లు, లాడ్జీల వెంట తిరిగి ఆనందించారు, ఎవరిని ఎవరు మోసం చేశారనేది నిర్ధారించడం కష్టమని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో, లైంగిక వేధింపులు, అత్యాచారానికి గురైనట్లు బాధితురాలి వాదనలను అంగీకరించలేమని, ట్రయల్ కోర్టు నిందితులను నిర్దోషిగా విడుదల చేసిందని కోర్టు నిర్ధారించింది.