NTV Telugu Site icon

Maldives President: నేడు ప్రధాని మోడీతో మాల్దీవుల అధ్యక్షుడు భేటీ..

Maldivus

Maldivus

Maldives President: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు 4 రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రత్యేక విమానంలో ముయిజ్జు తన భార్య సాజిదా మహ్మద్ తో కలిసి నిన్న (ఆదివారం) ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్ తో ముయిజ్జూ సమావేశం అయ్యారు. ఇక, ఈ రోజు (సోమవారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మాల్దీవుల అధినేత ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. వీరి చర్చల ద్వారా రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశిస్తున్నారు.

Read Also: CBI Arrests Customs Officer: లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన కాకినాడ కస్టమ్స్‌ అధికారి..

కాగా, ఈ పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతోను మహ్మద్ ముయిజ్జూ సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో ఇరు దేశాల ప్రయోజనాలపై చర్చించనున్నారు. ముంబై, బెంగళూరు సిటీల్లో జరిగే పలు కార్యక్రమాల్లో మహ్మద్ ముయిజ్జూ పాల్గొనున్నారు.

Show comments