High Court: క్రూరత్వానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల శిక్షను ఎదుర్కొంటున్న కుటుంబానికి బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది. క్రూరత్వం, ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని, అతడి కుటుంబాన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఔరంగబాద్ బెంచ్ తీర్పు చెప్పింది. తన చనిపోయిన భార్య పట్ల క్రూరత్వానికి పాల్పడ్డాడని ఒక వ్యక్తి అభియోగాలు ఎదుర్కొన్నాడు. అతనితో పాటు అతడి కుటుంబంపై 20 ఏళ్ల శిక్ష పడింది. అయితే ఐపీసీ 498A కింద నిందలువేయడం, పరిమితులు విధించడం తీవ్రమైన క్రూరత్వం కాదని కోర్టు తీర్పు చెబుతూ శిక్షని రద్దు చేసింది.
Read Also: Canada Student Visa: కెనడా వెళ్లాలనుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్‌కి షాక్.. SDS వీసా నిలిపివేత..
భార్యని అవహేళనర చేయడం, టీవీ చూడనివ్వకపోవడం, ఒంటరిగా ఆలయాన్ని సందర్శించకుండా చేయడం, చాపపై పడుకునేలా చేయడం వంటి ఆరోపణలు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 498A ప్రకారం “తీవ్రమైన” చర్యలు కాదని కోర్టు గుర్తించింది. క్రూరత్వం, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఐపీసీ సెక్షన్లు 498A మరియు 306 కింద దిగువ కోర్టు మరణించి మహిళ భర్తని అతడి తల్లిదండ్రుల్ని, సోదరుడిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటించింది.
అక్టోబర్ 17న జస్టిస్ అభయ్ ఎస్ వాఘ్వాసే ఈ కేసును విచారించారు. మహిళ తయారు చేసిన భోజనం గురించి అవహేళన చేయడం, ఆమె టీవీని చూడటాన్ని పరిమితం చేయడం, పొరుగింటికి వెళ్లడాన్ని, ఒంటరిగా ఆలయానికి వెళ్లడాన్ని నిషేధించడం, ఆమె కార్పెట్‌పై పడుకునేలా చేయడం వంటివి ఆరోపణలుగా ఉన్నాయి. మరణించిన మహిళ కుటుంబం ఈ ఆరోపణల్ని చేసింది. ఇదే కాకుండా సదరు మహిళని అర్థరాత్రి నీటిని పట్టాలని వేధించాలని ఆరోపించింది. అయితే, కోర్టు విచారణలో మహిళ, ఆమె అత్తమామలు నివసించే ఏరియాలో తెల్లవారుజామున 1.30 గంటలకు నీటి సరఫరా జరుగుతుందని సాక్ష్యులు వెల్లడించారని కోర్టు గుర్తించింది.