Chhattisgarh: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ బోర్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోల హతం

  • ఛత్తీస్‌గఢ్-తెలంగాణ బోర్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్
  • ఐదుగురు మావోల హతం
15maoistskilled

15maoistskilled

ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 20 వేల మంది భద్రతా దళాలు అతిపెద్ద ఆపరేషన్ చేపట్టారు. కర్రెగుట్టలలో భారీ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లుగా సమాచారం. భారీగా మావోలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు వెయ్యి మందికి పైగా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 20 వేల మంది సైనికులు మోహరించారు. ఈ కూంబింగ్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని సమాచారం. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Jammu Kashmir: భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్.. ఆర్మీ జవాను వీరమరణం..