బీహార్ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. అన్ని పార్టీలు ఎవరికి వారే గంపెడాశలు పెట్టుకున్నాయి. సర్వే ఫలితాలు అధికార కూటమికే అనుకూలంగా ఉన్నా.. విపక్ష కూటమి కూడా ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని చెబుతోంది.
ఇది కూడా చదవండి: Nitish Kumar: తొమ్మిది సార్లు బీహార్ సీఎంగా నితీష్ కుమార్.. పదోసారి పీఠం దక్కేనా..?
ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలు రాకముందే అలీనగర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన గాయని మైథిలి ఠాకూర్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. బీహార్ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయడం తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయంగా తెలిపారు. సర్వే ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో మానసికంగా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని పేర్కొ్న్నారు. 30 రోజుల ప్రయాణంలో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. సంతృప్తిగా ఉన్నాను కాబట్టే గెలుస్తానో.. ఓడిపోతానో అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదన్నారు. విజయంపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. అలీనగర్‌లోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తానన్నారు.
ఇది కూడా చదవండి: Vijay- Rashmika : విజయ్-రష్మిక.. ఇప్పటికైనా నిజం చెప్పేస్తారా..?
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో పోలింగ్ జరిగింది. రెండు విడతల్లోనూ రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తంగా 66.90 శాతం పోలింగ్ నమోదైంది. ఇది గత అసెంబ్లీ ఎన్నికల కంటే 9.6 శాతం ఎక్కువ అని ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ తెలిపారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 57.29 శాతం పోలింగ్ నమోదైంది.
