NTV Telugu Site icon

Maheshwer reddy: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మహేశ్వర్‌ రెడ్డి..

Maheshwer Reddy

Maheshwer Reddy

Maheshwer reddy: బీజేపీలో బీజేపీలో మహేశ్వర్ రెడ్డి చేరారు. కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించిన ఆయన ఇవాల ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో కషాయి కండువా కప్పుకున్నారు. ఇవాల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన నడ్డా సమక్షంలో బీజేపీ చేరారు. మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతం అయ్యిందని బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో చేరాలని రెండేళ్లుగా నాతో సంప్రదింపులు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో అవమానాలు భరిస్తూ.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అన్నారు. షోకాజ్ నోటీస్ ఇవ్వడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ దేశం కోసం నిస్వార్థం గా పని చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతం బీజేపీ తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ లు కలిసి అడుగులు వేసే దిశగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Jio Studios: వంద కథలతో సాలిడ్ అనౌన్స్మెంట్…

పార్లమెంట్ లో కాంగ్రెస్ తో టీఆర్‌ఎస్‌ లు కలిసి పని చేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై కార్యకర్తలకు ప్రతి రోజు టెన్షన్ అని తెలిపారు. కోవర్టులు ఉన్నారని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. 15 ఏళ్లుగా పార్టీ కోసం నిబద్దతగా పని చేశా అని అన్నారు. సోషల్ మీడియాలో అపోహలు చూసి తనకు గంటలో రిప్లై ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. పొగ పేట్టి పంపాలని చూశారని ఆరోపించారు. కష్టపడి పని చేస్తే.. షోకాజ్ బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పని చేసినా వాళ్లకు అనుమానమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తో సమస్య లేదని తెలిపారు. మచ్చ లేకుండా పని చేశా అని అన్నారు. ఉడుములాగా గాంధీ భవన్ లోకి వచ్చాడు.. సీనియర్లను బయటకి పంపిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Show comments