Maharashtra CM Post: సీఎం ఎంపిక మరింత ఆలస్యం కానుందా? కారణమిదేనా..!
- వీడని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ
- మరిన్ని రోజులు కొనసాగే అవకాశం
- డిసెంబర్ 2 లేదా 5న ప్రమాణస్వీకారం ఉండే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఇంకా సస్పెన్ష్ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినా సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. ఎటు తెగని పంచాయితీగా మారిపోయింది. నవంబర్ 23న విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ సొంతంగా 132 సీట్లు దక్కించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ పొత్తు ధర్మం కారణంగా సమస్య కొలిక్కి రావడం లేదు. ఇంకో వైపు జార్ఖండ్‌లో మాత్రం హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసేశారు. మహారాష్ట్ర పంచాయితీ మాత్రం సస్పెన్ష్ థిల్లర్‌గా సాగుతోంది. ఇక శుక్రవారం ముంబైలో మహాయుతి కూటమి సమావేశం జరగాల్సి ఉండగా.. హఠాత్తుగా రద్దైంది. దీంతో సీఎం ఎంపిక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
గురువారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్‌తో వేర్వేరుగా సమావేశమై అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రి గాను, శివసేన, ఎన్సీపీ నుంచి డిప్యూటీ సీఎంలు ఉండేలా ప్రతిపాదన వచ్చినట్లుగా సమాచారం. అలాగే బీజేపీకి 22, శివసేనకు 12, ఎన్సీపీకి 9 మంత్రిత్వ శాఖలు దక్కనున్నాయి. అయితే ఈ ప్రతిపాదనకు షిండే మొగ్గు చూపలేదని తెలుస్తోంది. తన కుమారుడి భవిష్యత్‌ను పరిష్కరించాలని షిండే పట్టుబట్టినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. అంతేకాకుండా కీలకమైన హోంశాఖతో పాటు అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ వర్క్స్ మరియు మరికొన్ని కీలక పోర్ట్‌ఫోలియోలను శివసేన అడుగుతుంది. అయితే హోం శాఖను మాత్రం వదులుకోవడానికి బీజేపీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మహాయుతిలో తర్జన భర్జన జరుగుతోంది.
Also Read
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
ఇదిలా ఉంటే రెండ్రోజులు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏదొక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనంతరం డిసెంబర్ 2 గానీ, లేదంటే డిసెంబర్ 5న గానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డిప్యూటీ సీఎం పోస్టు తీసుకోవాలంటూ షిండేను ఒప్పిస్తున్నారు. కానీ ఆయన పై నుంచి మెట్టు దిగేందుకు మనసు అంగీకారంగా లేనట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41, ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, కాంగ్రెస్ 16, శరద్ పవార్ పార్టీ 10 సీట్లు గెలుచుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కాలం ఇప్పటికే ముగిసింది. కానీ కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. అయితే రాష్ట్రపతి పాలన వస్తుందంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. త్వరలోనే మహాయుతి ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ పెద్దలు అంటున్నారు.
తాజావార్తలు
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!