NTV Telugu Site icon

Maharashtra CM Post: మహారాష్ట్ర సీఎం ఎంపికపై నేడు కీలక భేటీ..

Maharastra

Maharastra

Maharashtra CM Post: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అనే అంశానికి నేటితో తెరపడనుంది. గతంలో ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్న దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోడవం దాదాపు ఫిక్స్ అయింది. నేడు (నవంబర్ 28) ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ, అమిత్‌ షా, జేపీ నడ్డాలతో ఏక్‌నాథ్‌ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ భేటీ తర్వాత కేబినెట్‌ కూర్పుపై తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అయితే, మహాయుతి కూటమిని శాసనసభ ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చినందుకు మళ్లీ తననే ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబట్టిన శివసేన చీఫ్, ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్‌ షిండే డిమాండ్ చేశారు.

Read Also: Priyanka Gandhi: నేడు ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణస్వీకారం

ఇక, ఎన్డీయే కూటమి ధర్మాన్ని పాటిస్తూ మళ్లీ తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టిన ఏక్ నాథ్ షిండే బుధవారం పట్టు సడలించారు. కొత్త సీఎం ఎంపికపై ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనేత అమిత్‌షాల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. దీంతో దేవేంద్ర ఫడ్నవిస్‌ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ సర్కార్‌ మహారాష్ట్రలో మరోసారి కొలువుతీరడం దాదాపు ఖాయమైంది. ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ చీఫ్‌ అజిత్‌పవార్‌లు ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టబోతున్నట్లు సమాచారం. నవంబర్‌ 30 లేదా డిసెంబర్‌ ఒకటో తేదీన సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని అజిత్‌ పవార్‌ వెల్లడించారు.