NTV Telugu Site icon

Rahul Gandhi: ఒకవైపు మహాత్మా గాంధీ, మరో వైపు గాడ్సే..ఎంపీ ప్రచారంలో రాహుల్ గాంధీ..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. గత దశాబ్ధకాలం నుంచి ఆ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉంటోంది. అయితే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరును మహాత్మా గాంధీ, గాడ్సేల మధ్య పోరుగా అభివర్ణించారు.

రాహుల్ గాంధీ బీజేపీ పార్టీని మహత్మా గాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సేతో పోల్చారు. ఎంపీలోని షాజాపూర్ లో జరిగిన ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరాటమని, ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఉంలటే మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నాయని, ఒక వైపు మహాత్మా గాంధీ ఉంటే మరో వైపు గాడ్సే ఉన్నారని ఆయన అన్నారు.

Read Also: Rk Roja: సీఎం జగన్ ను విమర్శిస్తే.. మర్యాద దక్కదు బ్రాహ్మణి..?

కాంగ్రెస్ సోదరభావం పెంచితే, బీజేపీ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎక్కడికెళ్లినా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందని, మధ్యప్రదేశ్ యువత, రైతులు వారిని బీజేపీని అసహ్యించుకుంటున్నారని, ప్రజలకు వారు ఏం చేశారు, ప్రజల నుంచి వారు అదే పొందుతారు అని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో మధ్యప్రదేశ్ కి చెందిన రైతులు తనను కలిశారని, వారు నాతో చాలా చెప్పారని, ఈ రాష్ట్రంలో బీజేపీ చేసిన అవినీతి దేశంలో ఎక్కడా జరగలేదని రాహుల్ ఆరోపించారు. రైతులు పండించిన పంటకు సరైన ధర లభించట్లేదని, ఛత్తీస్‌గఢ్ లో బియ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2500 ఇస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని అన్నారు.

ఈ ఏడాది చివరలో మధ్యప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల ముందు వస్తున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కీలకం కానున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇరు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.