Site icon NTV Telugu

Maharashtra Political Crisis: రాజ్ ఠాక్రేకు ఏక్ నాథ్ షిండే ఫోన్.

Raj Thackery Shinde

Raj Thackery Shinde

మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు డిప్యూటీ స్పీకర్ అనర్హతను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నేడు సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టనుంది. మరోవైపు రెబెల్ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. సోమవారం ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గౌహతి లోని రాడిసన్ బ్లూ హోటల్ లో 2 గంటలకు భేటీ కాబోతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చలు జరుపుతున్నారు.

తాజాగా మహారాష్ట్రలో మరో కీలక పరిణామా చోటు చేసుకుంది. రెబెల్ శివసేన నేత ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రేతో రెండు సార్లు ఫోన్ లో మాట్లాడారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి వీరిద్దరు చర్చించారు. ఇదే విధంగా రాజ్ ఠాక్రే ఆరోగ్యం పరిస్థితి గురించి షిండే ఆరా తీశారు.

మరోవైపు ఏక్ నాథ్ షిండే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీంతో పాటు అమాయకులైన ప్రజల ప్రాణాలు తీసిన వారికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని అన్నారు.. వారికి మద్దతు ఇవ్వడం కన్నా చనిపోవడం మేలు అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

ముంబై బాంబు పేలుళ్ల నిందితులు దావూద్ ఇబ్రహీం మరియు అమాయకుల ప్రాణాలను తీయడానికి కారణమైన వారికి మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ, ఇతర ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతం అస్సాంలో క్యాంప్ చేస్తున్న షిండే ఆదివారం నాడు పార్టీపై విరుచుకుపడ్డారు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్నవారికి బాలాసాహెబ్ ఠాక్రే శివసేన ఎలా మద్దతు ఇస్తుందని ప్రవ్నించారు. హిందుత్వ భావజాలాన్ని అనుసరించడానికి రెబెల్ ఎమ్మెల్యేలు చనిపోవాల్సి వచ్చినా.. దానిని విధిగా భావిస్తారని ఏక్ నాథ్ షిండే ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

 

 

Exit mobile version