NTV Telugu Site icon

Maharashtra: స్కూల్‌లో విద్యార్థులు డమ్మీ ఫైటింగ్.. ఓ టీచర్ ఏం చేసిందంటే..! వీడియో వైరల్

Maharashtra

Maharashtra

గురువులు.. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దేవారు. బంగారు భవితకు బాటలు వేసేవారు. పిల్లలు.. తల్లిదండ్రుల తర్వాత.. ఎక్కువగా గడిపేది ఉపాధ్యాయుల మధ్యనే. అందుకే విద్యార్థులకు-టీచర్ల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. అంతేకాకుండా గురువులే మార్గదర్శకులు. అయితే ఇదంతా ఎందుకంటారా? సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా మహారాష్ట్రలో జరిగిన సంఘటన తాజాగా వైరల్‌గా మారింది.

ఇది కూాడా చదవండి: Jr NTR: డైరెక్టర్ గారూ.. నాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేయండి.. ఎన్టీఆర్ అభ్యర్ధన!!

సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్‌కు విద్యార్థులంతా ఓ సర్‌ఫ్రైజ్ ఇవ్వాలనుకున్నారు. అంతే ఒక చక్కటి ఫ్లాన్ వేశారు. క్లాస్ రూమ్‌లో విద్యార్థులు డమ్మీ ఫైటింగ్‌కు దిగారు. ఈ విషయం కాస్త ఉపాధ్యాయురాలికి తెలిసింది. అంతే ఆగమేఘాలపై క్లాస్ రూమ్‌లోకి పరుగెత్తుకుంటూ దూసుకొచ్చింది. విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. విద్యార్థులు ఆశ్చర్యానికి గురిచేశారు. ఆమెకు చీర్స్, పుష్పగుచ్ఛం, చప్పట్లతో స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 54 మిలియన్ల వీక్షించారు. కరాడ్‌లోని జయవంత్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న సర్గం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఇది కూాడా చదవండి: Bribe: ఏసీబీ వలకు చిక్కిన ఎంఈవో.. రూ.2లక్షలు లంచం తీసుకుంటూ..

ఇదంతా విద్యార్థుల ఆశ్చర్యకరమైన వేడుకలో భాగమని ఆమె గ్రహించడంతో ఉపాధ్యాయుని ఆనందం వ్యక్తం చేసింది. చిరునవ్వుతో కరిగిపోయింది. టీచర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తు్న్నారు. శెభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను మీరు చూసేయండి.

Show comments