Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు ఒక నెల మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల షేరింగ్‌పై బీజేపీ-షిండే శివసేన- అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ‘‘మహాయుతి’’ స్పీడ్ పెంచింది. సీట్ల షేరింగ్ విషయమైన గత రాత్రి కేంద్ర హోం మంత్రితో కూటమి నేతలు భేటీ అయ్యారు. చర్చలు కీలక దశలో ఉన్న సమయంలో సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో అమిత్ షాని కలిశారు.
Read Also: Ananya Nagalla: అనన్య నాగళ్ళకి క్యాస్టింగ్ కౌచ్ ప్రశ్న.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉంటే బీజేపీ 155 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 105 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మిగిలిన స్థానాల్లో ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల మధ్య పంపకాలు జరగాల్సి ఉంది. నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని మహాయుతి కూటమి భావిస్తోంది.
మరోవైపు కాంగ్రెస్-ఠాక్రే శివసేన-శరద్ పవార్ ఎన్సీల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమి అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే, ఈ కూటమిలో శివసేన ఠాక్రే, కాంగ్రెస్ మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలేపై, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బహిరంగంగానే విమర్వలు గుప్పించారు. శివసేన విదర్భ ప్రాంతంలో ఎక్కువ స్థానాల్ని కోరుతుంటే, కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ వచ్చిన ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లను కోరుకుంటున్నట్లు సమాచారం. ఎంవీఏ కూటమి మొత్తం 288 స్థానాల్లో 263 చోట్ల సీట్ల షేరింగ్ ఖరారైనట్లు వినికిడి. 25 స్థానాల్లో ప్రతిష్టంభన నెలకొని ఉంది. వీటిలో కుర్లా, ధారావి, వెర్సోవా, బైకుల్లా వంటి సహా ముంబైలోని 36 నియోజకవర్గా్ల్లో 5 ఉన్నాయి.