Site icon NTV Telugu

Maharashtra: బిడ్డతో అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యే..

Maharashtra

Maharashtra

Maharashtra MLA Attends Assembly With Her Baby: మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు నాగ్‌పూర్‌లోని మహారాష్ట్ర అసెంబ్లీకి తన రెండున్నర నెలల పాపతో మహిళా ఎమ్మెల్యే వచ్చారు. డియోలాలి నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ( ఎన్సీపీ ) ఎమ్మెల్యేగా ఎన్నికైన సరోజ్ అహిరే శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు చంటి బిడ్డతో వచ్చారు. బిడ్డను చేతిలో పట్టుకుని అసెంబ్లీలో నడుస్తున్న ఎమ్మెల్యే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Read Also: Dalai Lama: చైనాకు తిరిగెళ్లే ప్రసక్తే లేదు.. భారత్‌లోనే ఉంటా

చంటిపాపతో చాలా మంది సెల్ఫీలు కూడా తీసుకున్నారు. కోవిడ్ తర్వాత రెండేళ్లకు నాగ్ పూర్ లో తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో ఈ సారి సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని అనుకున్నానని ఎమ్మెల్యే సరోజ్ వెల్లడించారు. నేను తల్లిని, ప్రజాప్రతినిధిని. కరోెనా మహమ్మారి కారణంగా గత రెండున్నరేళ్లుగా నాగ్‌పూర్‌లో అసెంబ్లీ సమావేశాలు జరగలేదని ఆమె అన్నారు. నేను ప్రజాసమస్యలు ప్రస్తావించడానికి, నా ఓటర్లు సమాధానాలు పొందేందుకు ఇక్కడికి వచ్చానని ఆమె అన్నారు.

Exit mobile version