NTV Telugu Site icon

Nitesh Rane: కేరళ మినీ పాకిస్థాన్.. అందుకే రాహుల్, ప్రియాంక గెలిచారు.. మహారాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Nitesh Rane

Nitesh Rane

మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ మినీ పాకిస్థాన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే అక్కడ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ గెలిచారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులంతా రాహుల్, ప్రియాంకకు ఓటేశారు.. అందుకే వారిద్దరు గెలిచారని పేర్కొన్నారు.

ప్రస్తుతం నితీష్ రాణే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? అని కాంగ్రెస్ నిలదీస్తోంది. అతను పదవిలో ఉండే అర్హత లేదని.. తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది.

కేరళ మినీ పాకిస్థాన్ అంటూ చేసిన వ్యా్ఖ్యలు తీవ్ర దుమారం చెలరేగడంతో నితీష్ రాణే స్పందించారు. కేరళలో లవ్ జిహాద్, మత మార్పిడుల ఘటనల కారణంగానే తాను పాకిస్థాన్‌తో పోల్చినట్లు వివరణ ఇచ్చారు. నితీష్ రాణే… కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే కుమారుడే నితీష్ రాణే. మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉన్నారు. సెప్టెంబరులో కూడా రెచ్చగొట్టే ప్రసంగాలతో రెచ్చగొట్టారు. ముస్లింలను కొడతానంటూ బెదిరించాడు. దీంతో అతనిపై పోలీసు కేసు నమోదు అయింది. అలాగే శివసేనకు చెందిన సంజయ్ రౌత్ కూడా ఆయనపై పరువు నష్టం దావా వేశారు. ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ ‘దళిత’ అనే పదాన్ని వాడినందుకు నవీ ముంబై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

Show comments