Site icon NTV Telugu

మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఆసక్తికర వ్యాఖ్యలు… ఆగస్టు లో థర్డ్ వేవ్… 

దేశంలో సెకండ్ వేవ్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది.  కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  మహమ్మారి కేసులు వేగంగా వ్యాపిస్తుండటంతో కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు.  ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే.  రోజుకు 60వేలకు పైగా పాజిటివ్ కేసులు 800 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.  రెండో దశ ప్రభావం మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్రపైనే  అధికంగా ఉన్నది.  అయితే, సెకండ్ వేవ్ తో కరోనా తొలగిపోలేదని, జులై ఆగస్టు నెలల్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని, థర్డ్ వేవ్  సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి తప్పులు దొర్లినా పెను ప్రమాదం తప్పదని, ఆక్సిజన్ కొరత  చూడాలని ఆధికారులను ఆదేశించారు.  

Exit mobile version