మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ సంక్షభం ఏర్పడింది.. ఓ మంత్రి సహా దాదాపు 15 మంది ఎమ్మెల్యేలో అజ్ఞాతంలోకి వెళ్లడం.. అధికార కూటమిలో కలకలం సృష్టిస్తోంది.. దీంతో.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన ఒక రోజు తర్వాత, శివసేన నాయకుడు మరియు మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే, కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి.. అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు.. సోమవారం జరిగిన శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించగా, శివసేన, ఎన్సీపీ రెండు స్థానాలతో సరిపెట్టుకున్నాయి..
Read Also: President Elections 2022: రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య ఫైనల్..? కాసేపట్లో ప్రకటన..!
ఇదే సమయంలో.. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాజ్యసభ మరియు ఎమ్మెల్సీ ఎన్నికలకు స్వతంత్రులు మరియు చిన్న రాజకీయ పార్టీల నుండి భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా మద్దతు లభించిందన్న ఆయన.. మాకున్న సమాచారం ప్రకారం, మంత్రి ఏక్నాథ్ షిండే సహా 35 మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. దీని అర్థం సాంకేతికంగా రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో ఉందని పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొననుండడం సంచలనంగా మారింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై అసంతృప్తితో మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే.. మరో 15 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గుజరాత్‌లో సూరత్‌కు వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది.. తన వెంట 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏక్‌నాథ్ షిండే తెలిపినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.. ఏక్‌నాథ్ షిండే టీమ్ మొత్తం గుజరాత్ బీజేపీ అధ్యక్షుడితో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
