Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- నాయకుల శైలిలో మార్పులు
- ప్రజా రవాణాలో నాయకుల ప్రయాణాలు
- ఇండిగోలో బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఇచ్చిన పొదుపు మంత్రం పిలుపు నాయకుల జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చాయి. ముఖ్యమంత్రి అంటే సహజంగా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఉంటాయి. ఎక్కడికి వెళ్లాలన్న నిశ్చతంగా వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు దేశంలో పరిస్థితులు మారాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. దీంతో అన్ని దేశాలు కఠినంగా పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కూడా అమలవుతోంది.

Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఇందులో భాగంగానే ప్రధాని మోడీ దగ్గర నుంచి కింద స్థాయి నాయకులంతా కాన్వాయ్‌ల సంఖ్య తగ్గించేశారు. గురువారం బుల్లెట్‌పై సచివాలయానికి వెళ్లిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. తాజాగా సాధారణ విమాన ప్రయాణాన్ని ఎంచుకున్నారు. పుణె నుంచి బెంగళూరుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎకానమీ క్లాస్‌లో సాధారణ ప్రయాణికులతో కలిసి ముఖ్యమంత్రి ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణ చర్యలు అమలవుతున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు కూడా సాధారణ జీవనశైలిని అనుసరిస్తున్నారు.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ అయతుల్లా ఖమేనీ హతమయ్యారు. అనేక మంది ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు వెళ్లే నౌకలు నిలిచిపోయాయి. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తుండగా.. ప్రస్తుతం భారత్‌లో అమలవుతోంది.
Maharashtra CM Devendra Fadnavis travels from Pune to Bengaluru by an economy flight of IndiGo Airlines, in line with PM Modi's appeal amid the West Asia Conflict. pic.twitter.com/DerUjeJXc7
— ANI (@ANI) May 15, 2026
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!