Maharashtra CM Eknath Shinde To Visit Ayodhya Today: మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు అయోధ్యలో పర్యటించనున్నారు. సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయోధ్య రాముడిని దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి వెంట వేల సంఖ్యలో శివసైనికులు రానున్నారు. గతేడాది జూన్ నెలలో సీఎంగా ఎన్నికైన తర్వాత ఆయన తొలిసారిగా అయోధ్యకు వచ్చారు. శనివారం ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అయోధ్య బయలుదేరారు. నగరంలోని అన్ని హోటళ్లు, గెస్ట్ హైజ్ లు బుక్ అయ్యాయి. ఈ రోజు సీఎం ఏక్ నాథ్ షిండే పర్యటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా చేరనున్నారు.
Read Also: Covid 19: పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ మూడు రాష్ట్రాల్లో మాస్కులు తప్పనిసరి..
ఆదివారం ఫడ్నవీస్ సరయూ నది ఒడ్డున, రామజన్మ భూమి వద్ద మహా ఆరతికి హాజరవుతారు. కొత్తగా నిర్మిస్తున్న ఆలయాన్ని సందర్శిస్తారు. సీఎం ఏక్ నాథ్ షిండే ఆదివారం హనుమాన్‌గర్హి ఆలయం, రామ మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. గతంలో రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించడానికి ఒక ఏడాది ముందు ఏక్నాథ్ షిండే 2020లో అయోధ్యలో పర్యటించారు.
శనివారం అయోధ్య పర్యటనలో భాగంగా లక్నో చేరుకున్న సీఎం ఏక్ నాథ్ షిండేకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఇది రాజకీయ పర్యటన కాదని, నేను ఇంతకుముందు కూడా అయోధ్యను సందర్శించానని, కానీ ముఖ్యమంత్రిగా తొలిసారిగా వస్తున్నానని అన్నారు. శివసేన నేతలు విల్లు, బాణం గుర్తు తెచ్చుకున్న తర్వాతే అయోధ్యకు వెళ్లాలని అనుకున్నామని ఆయన అన్నారు. ఉద్దవ్ ఠాక్రే గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో పాల్ఘర్ లో సాధువులను చంపారని, కానీ మా ప్రభుత్వం సాధువులను రక్షిస్తోందని అన్నారు.
