Site icon NTV Telugu

Heart attack: ఆడుకుంటూ గుండెపోటుతో మరణించిన 10 ఏళ్ల బాలుడు..

Heart Attack

Heart Attack

Heart attack: ఇటీవల కాలంలో వరస గుండెపోటు ఘటనలు కలవరపెడుతున్నాయి. యువతతో పాటు చిన్నపిల్లలు కూడా అకస్మాత్తు గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాకు చెందిన 10 ఏళ్ల బాలుడు శ్రావణ్ అజిత్ గవాడే హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. గురువారం సాయంత్రం శ్రావణ్ ఇతర పిల్లలతో కలిసి గణపతి మండపంలో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఇంటికి పరిగెత్తి తల్లి ఒడిలో పడుకున్నాడు, అక్కడే చివరి శ్వాస విడిచారు.

Read Also: Dharmasthala: ధర్మస్థలపై తప్పుడు ప్రచారం, డబ్బులు తీసుకుని యూట్యూబర్ల కథనాలు

బాలుడి మరణంలో కోడోలి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడి తండ్రి అజిత్ గవాడే కుటుంబం కోడోలిలోని వైభవ్ నగర్‌లో నివసిస్తోంది. అజిత్ గవాడేకు ఇద్దర పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తె నాలుగు ఏళ్ల క్రితం మరణించింది. ఇప్పుడు వారి ఏకైక కుమారుడు శ్రావణ్ మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది.

Exit mobile version