NTV Telugu Site icon

Maharashtra: వామ్మో.. నడిరోడ్డుపైకి మొసలి.. హడలెత్తిపోయిన జనాలు

Crocodile

Crocodile

మొసలిని చూస్తేనే మామూలుగా బెంబేలెత్తిపోతారు. అలాంటిది మన కళ్ల ముందే ప్రత్యక్షమైతే ఇంకెలా ఉంటుంది. గుండెలు జారిపోవు. నదిలో సేదదీరాల్సిన మొసలి ఒకటి.. జనారణ్యంలోకి వచ్చేసింది. దాని చూసిన కొందరు భయపడగా.. ఇంకొందరు మొబైల్‌లో బంధించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని రత్నగిరిలో రోడ్డుపై చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Kadapa: కాజిపేటలోని జడ్పీ హైస్కూలులో విద్యార్థినుల అస్వస్థత..ఆసుపత్రిలో చేరిన10మంది

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు, నదులు ఏకమై ప్రవహిస్తున్నాయి. దీంతో 8 అడుగుల పొడవైన మొసలి ఒకటి రద్దీగా ఉంటే ఒక రహదారిపైకి వచ్చేసింది. రత్నగిరిలో రోడ్డుపై ఆదివారం రాత్రి మొసలి ప్రత్యక్ష మైంది. ఓ వైపు వాహనాలు వెళ్తుంటే.. ఇంకోవైపు నుంచి వేగంగా దూసుకొచ్చేసింది. దీంతో కొందరు భయపడగా.. మరికొందరు మొబైల్లో చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నది నుంచి వచ్చి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. అనంతరం చాకచక్యంగా ప్రజలు బంధించారు.

ఇది కూడా చదవండి: Kadapa: కాజిపేటలోని జడ్పీ హైస్కూలులో విద్యార్థినుల అస్వస్థత..ఆసుపత్రిలో చేరిన10మంది

గత ఏడాది కూడా భారీ వర్షాలు కారణంగా ఇదే తరహాలో వడోదరలో మొసలి దర్శనమిచ్చింది. విశ్వామిత్ర నది సమీపంలో రోడ్డుపై మొసలిని స్థానికులు గుర్తించారు.12 అడుగుల మొసలి వచ్చినట్లుగా గుర్తించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు పట్టుకుని నదిలో వదిలిపెట్టారు.

ఇది కూడా చదవండి: Ragi Java : ప్రతిరోజు రాగి జావా తాగితే ఇన్ని ప్రయోజనాలా..

 

Show comments