Mahadev Betting App: గతేడాది జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో వెలుగులోకి వచ్చిన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంలో మరో కీలక పరిణామం నెలకొంది. ఈ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌ను దుబాయ్‌లో ఇటీవల అరెస్టు చేశారు. త్వరలో అతన్ని భారతదేశానికి తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు ఈరోజు (శుక్రవారం) ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. చంద్రకర్‌తో పాటు యాప్ మరొక ప్రమోటర్ అయిన రవి ఉప్పల్‌ను కూడా గత ఏడాది చివర్లో దుబాయ్ లోనే అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Buttermilk Sugar: మజ్జిగ పంచదార కలిపి తాగుతున్నారా..?
అయితే, మహాదేవ్ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లో తమ విచారణలో సౌరభ్ చంద్రకర్, రవితో చత్తీస్‌గఢ్‌కు చెందిన వివిధ ఉన్నతస్థాయి రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో ఒకరైన చంద్రకర్ వివాహం కోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ వివాహానికి హాజరైన వారి కోసం ఓ ప్రైవేటు జెట్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు ఇంగ్లీస్ మీడియా స్టోరీ ప్రసారం చేసింది. ఈ కార్యక్రమం కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి రూ.112 కోట్ల హవాలా మార్గంలో నిర్వాహకులు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఒక్క హోటల్ గదుల కోసమే రూ.42 కోట్లు చెల్లించినట్లు సమాచారం. మరో నిర్వాహకుడు రవి ఉప్పల్ నిర్వహించిన మరో పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చారు. ఈ క్రమంలో హవాలా మార్గంలో వచ్చిన సొమ్మును బాలీవుడ్ సెలబ్రిటీలకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు చెల్లించారని ఈడీ చెప్పుకొచ్చింది.